ఏపీలో ప్రత్యేక హోదా అంశంపై రాజకీయం జోరుగా నడుస్తోంది…ఇటీవల కేంద్ర హోమ్ శాఖ విభజన హామీల్లో హోదాని పెట్టి మళ్ళీ తొలగించడంపై పెద్ద రచ్చ నడుస్తోంది. అసలు హోదాని మొదట విభజన హామీల్లో చేర్చినప్పుడు వైసీపీ శ్రేణులు ఎక్కడా ఆగలేదు…అదిగో మా జగనన్న హోదా సాధించేసారని హడావిడిగా ప్రచారం చేశాయి. తీరా హోదా అంశాన్ని తీసేయగానే..అదిగో చంద్రబాబు…మేనేజ్ చేసి తీయించేశారని, బీజేపీలో ఉన్న తన సన్నిహితులకు చెప్పి ఈ పని చేయించారని వైసీపీ శ్రేణులు, నాయకులు ప్రచారం చేస్తున్నారు.

అయితే దీనిపై టీడీపీ శ్రేణులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నాయి…చంద్రబాబుకు మేనేజ్ చేసే శక్తి ఉంటే..ఇప్పుడు ఇలాంటి పరిస్తితి ఉండేది కాదని, జగన్ అసమర్ధతని బాబుపైకి తోసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అటు హోదా అంశాన్ని ఎజెండా నుంచి తొలగించటం వెనుక.. తన హస్తం ఉందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, అది ముమ్మాటికి అవాస్తవమని, చంద్రబాబు చెబితే తాము మార్చడమా..? ఇంత సిగ్గులేకుండా వైసీపీ నాయకులు మాట్లాడతారా? అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు.

అంటే ఇందులో వైసీపీ రాజకీయం ఎలా చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు…మెడలు వంచి హోదా తెస్తానని చెప్పి, వెంటనే అధికారంలోకి వచ్చి జగనే మెడలు వంచారని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచే యుద్ధం ఎప్పుడు మొదలు పెడతారని జగన్‌ని, చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గర్జించి, ఇప్పుడు కుక్కిన పేనులా ఉండటం దేనికి సంకేతమని బాబు ఫైర్ అయ్యారు.

అలాగే గతంలో ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ఎంపీలని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన జగన్..ఇప్పుడు 28 ఎంపీలు ఉన్న ఎందుకు రాజీనామా చేయడం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామా చేయాలని, వారు రాజీనామా చేస్తే… మా పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని రామ్మోహన్ చెప్పుకొచ్చారు. అయితే ఇలా టీడీపీ రివర్స్ ఎటాక్‌తో వైసీపీ ఇరుక్కుపోతుంది…మొదట బాబుపై నెపాన్ని నెట్టేయాలని చూశారు…కానీ టీడీపీ రివర్స్ అయ్యి జనాలకు క్లారిటీ ఇచ్చేసరికి వైసీపీనే ఇరుక్కునే పరిస్తితి వచ్చింది.

Discussion about this post