రాష్ట్రంలో ఒక అంశంపై నెగిటివ్ అవుతుందనుకుంటే…ఆ అంశాన్ని డైవర్ట్ చేసి…కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడంలో జగన్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండున్నర ఏళ్ల పాలన కాలంలో అనేక విధాలుగా సమస్యలని డైవర్ట్ చేస్తూ జగన్ ప్రభుత్వం కాలం గడుపుతుందనే చెప్పాలి. ఏదైనా ఒక అంశంపై ప్రజల్లో నెగిటివ్ వస్తుందనుకుంటే చాలు…దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నేతలు, ప్రతిపక్ష నేతలపై బూతులతో దాడి చేస్తారు.

దీంతో టోటల్ మ్యాటర్ పక్క దాడి పడుతుంది. తాజాగా కూడా డ్రగ్స్, గంజాయి అంశంపై రాష్ట్రంలో చాలా రచ్చ జరిగింది. ఇక ఈ అంశం పక్క దారి పట్టడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదిపిందనే చెప్పాలి…ఒక టీడీపీ నేత సజ్జలని ఉద్దేశించి ఒక మాట అన్నారు..అది జగన్‌నే అన్నారని, అసలు జగన్‌ని తిట్టారని చెప్పి, వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులతో గంజాయి అంశం పక్కకుపోయింది.

ఇక తాజాగా ఏపీలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే….వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు…చంద్రబాబుని ఉద్దేశించి ఎలాంటి మాటలు అన్నారో తెలిసిందే. ఆయన భార్యని కించపరుస్తూ ఎలా మాట్లాడారో కూడా తెలుసు. దీనిపై చంద్రబాబు కూడా కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ప్రజల్లో వైసీపీపై తీవ్ర ఆగ్రహం వచ్చే పరిస్తితి నెలకొంది. మరో వైపు వరదలతో రాయలసీమ, నెల్లూరు జిల్లా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ప్రభుత్వం అండ పెద్దగా దొరకలేదనే చెప్పాలి.

అలాగే రాజధాని అమరావతికి ప్రజల మద్ధతు రోజురోజుకూ పెరుగుతుంది. ఇటు కోర్టులో కూడా అమరావతికే అనుకూలంగా తీర్పు రావడం ఖాయమని తేలిపోయింది. ఈ పరిస్తితుల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం అనూహ్యంగా…మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుంది. అయితే అమరావతిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ పని వల్ల…రాష్ట్రంలో జరుగుతున్నా పరిణామాలన్ని డైవర్ట్ అయిపోయాయి.

Discussion about this post