Site icon Neti Telugu

దివ్య వర్క్ స్టార్ట్..తునిలో టీడీపీకి ఈ సారైనా కలిసొస్తుందా?

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తుని నియోజకవర్గంలో వర్క్ మొదలుపెట్టారు. అక్కడ బలం పెంచుకోవడమే దిశగా ఆమె పనిచేస్తున్నారు. ఇంతకాలం టి‌డి‌పి కోల్పోతున్న సీటుని మళ్ళీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన తండ్రి, బాబాయ్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. నెక్స్ట్ తునిలో పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు.

అయితే 2004 వరకు తుని అంటే యనమల ఫ్యామిలీ కంచుకోట..1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు యనమల తునిలో టి‌డి‌పి జెండా ఎగరవేశారు. ఇక 2009లో తొలిసారి ఓటమి చవిచూశారు. తర్వాత ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. 2014లో తన సోదరుడు కృష్ణుడుని బరిలో దింపారు. కానీ కృష్ణుడు గెలవలేదు. వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలిచారు. 2019 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్..పైగా ఇప్పుడు రాజా మంత్రిగా ఉన్నారు. దీంతో తునిలో రాజాకు తిరుగులేదనే పరిస్తితి. పైగా యనమల ఫ్యామిలీలో విభేదాలు టి‌డి‌పికి ఇబ్బందిగా మారాయి.

చంద్రబాబు అవన్నీ సెట్ చేసి…కృష్ణుడుకు వేరే విధంగా ప్రాధాన్యత ఇస్తానని చెప్పి..యనమల దివ్యకు తుని బాధ్యతలు ఇచ్చారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆమె తుని నుంచి పోటీ చేయనున్నారు. దీంతో ఈ సారి తునిలో పోటీ రసవత్తరంగా సాగనుంది. ఇప్పటికే దివ్య గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి..పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. తమ ఫ్యామిలీకి దూరంగా ఉన్న కొన్ని వర్గాలని దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అదే సమయంలో జనసేనతో పోత్తు కూడా టి‌డి‌పికి కాస్త కలిసి రావచ్చు. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 6 వేల ఓట్లు వరకు పడ్డాయి..ఇప్పుడు 15 వేల వరకు వెళ్లవచ్చు. దీంతో కాపు ఓట్లు కూడా కలిసొస్తాయి. చూడాలి మరి దివ్య..ఈ సారి తునిలో టి‌డి‌పి జెండా ఎగిరేలా చేస్తారో లేదో.

Exit mobile version