శ్రీకాకుళంలో ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా జరిగేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది..కానీ ఈ సారి టిడిపి దూకుడు మీద ఉంది. పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. టిడిపి నేతలు బలపడ్డారు. దీంతో సిక్కోలులో ఈ సారి టిడిపికి లీడ్ వచ్చేలా ఉంది. ఈ క్రమంలో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి.
గత ఎన్నికల్లోనే ఆయన 5 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈ సారి గెలుపు కష్టమయ్యేలా ఉంది. మంత్రిగా ఉన్న ఆయనకు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. పైగా ప్రజలని ఉద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటున్నారు. మంత్రిగా ఏం చేస్తున్నారో ఎవరికి క్లారిటీ లేదు. కేవలం నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. కాంగ్రెస్ లో మంత్రిగా ఉండగా ఆయన బాగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఏమీలేదు. దీంతో ఆయనకు నెగిటివ్ కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ధర్మాన పోటీ చేస్తారా? లేక ఆయన తనయుడు పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు.
సరే ఎవరు పోటీ చేసిన శ్రీకాకుళంలో ఈ సారి టిడిపి పట్టు సాధించేలా ఉంది. గత ఎన్నికల్లోనే గుండ లక్ష్మి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఈ సారి పక్కాగా గెలవాలని కష్టపడుతున్నారు. అయితే ఆమె పోటీ చేస్తారా? లేక ఆయన తనయుడు రంగంలోకి దిగుతారా? అనేది క్లారిటీ లేదు. కానీ ఇక్కడ టిడిపికి ఆధిక్యం కనిపిస్తుంది.
పైగా జనసేనతో పొత్తు ఉంటే టిడిపికి కలిసొస్తుంది. ఇక్కడ జనసేనకు కాస్త బలం ఉంది. గత ఎన్నికల్లో 7 వేల ఓట్లు పడ్డాయి. ఇప్పుడు 15 వేల ఓట్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే ఈ సారి ధర్మానకు చెక్ పడిపోయేలా ఉంది.