May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

ధూళిపాళ్ళకు ఆరో విజయం..పొన్నూరులో పైచేయి!

ధూళిపాళ్ళ నరేంద్ర ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు..వరుస విజయాలు సాధించిన నేత. ఓటమి ఎరగని నేతగా ఉన్న ఈయన గత ఎన్నికల్లో తొలిసారి ఓటమి రుచి చూశారు. పొన్నూరులో వరుసగా అయిదుసార్లు గెలిచిన ఈయన ఆరోసారి ఓటమి పాలయ్యారు. అసలు పొన్నూరు అంటే ధూళిపాళ్ళ ఫ్యామిలీ కంచుకోట.

1983, 1985 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి ధూళిపాళ్ళ వీరయ్య గెలిచారు. 1989లో ఓటమి పాలయ్యారు. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఇక 1994 ఎన్నికల నుంచి వీరయ్య వారసుడుగా నరేంద్ర రంగంలోకి దిగారు. టి‌డి‌పి నుంచి పొన్నూరులో వరుసగా గెలుస్తూ వచ్చారు. 1994, 1999 ఎన్నికల్లో గెలిచారు..కాంగ్రెస్ హవా ఉన్న 2004 , 2009 ఎన్నికల్లో కూడా గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో సైతం ఆయన విజయం సాధించారు.  అయితే 2019 ఎన్నికల్లో కూడా గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ వైసీపీ గాలిలో కేవలం 1112 ఓట్ల తేడాతో నరేంద్ర ఓడిపోయారు.

వైసీపీ నుంచి కిలారు రోశయ్య గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వ్యతిరేకత తెచ్చుకున్న వారిలో రోశయ్య ముందున్నారు. పొన్నూరులో ఈయనపై వ్యతిరేకత  బాగా పెరిగింది. అదే సమయంలో నరేంద్ర పై రాజకీయ కక్ష సాధించడం, అక్రమ కేసులతో జైలుకు పంపడం లాంటివి కూడా వైసీపీకి మైనస్. నరేంద్రపై సానుభూతి అమాంతం పెరిగింది.

ఇక ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న నరేంద్రకు పొన్నూరులో ఆధిక్యం వచ్చింది. ఇటీవల సర్వేల్లో ఆయన గెలవడం సులువు అని తేలింది. మొత్తానికి పొన్నూరులో నరేంద్ర ఆరోసారి గెలవడం ఫిక్స్ అయిందని చెప్పవచ్చు.