అసెంబ్లీ కార్యక్రమాలను పరిశీలిస్తున్న వారు… ఇదే మాట అంటున్నారు. అసెంబ్లీలో సీన్ రివర్స్ అయిం దని చెబుతున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఏం జరిగిందో ఇప్పుడు కూడా అం టే.. పట్టుమని మూడేళ్లు తిరగకుండానే.. అసెంబ్లీలో అదే సీన్ రిపీట్ అవుతోందని చెబుతున్నారు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికార పార్టీ టీడీపీ గుండుగుత్తుగా వైసీపీని సస్పెండ్ చేయడం.. సభను మొత్తం వారే నిర్వహించుకోవడం గురించి ఇప్పుడు మరోసారి చర్చకు వస్తోంది.

అప్పట్లో జగన్‌కు మైకు ఇవ్వలేదనే కారణంగా.. కీలక అంశాలపై ప్రతిపక్షానికి అసలు విలువ ఇవ్వడం లేదనే కారణంగా.. వైసీపీసబ్యులు సభను బాయ్‌కాట్ చేసేవారు. ఇప్పుడు అంత కాకపోయినా.. తాము లేవననెత్తిన అంశంపైచర్చకు అనుమతించడం లేదని పేర్కొంటూ.. టీడీపీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తున్నారు. ఫలితంగా సభలో వైసీపీ సభ్యులే ఉంటున్నారు. గతంలోనూ ఇలానే జరిగిందని.. ఇప్పుడు కూడా ఇదే జరుగుతోందని ..మేధావులు చెబుతున్నారు.

దీనివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమీలేదని అంటున్నారు. ఎందుకంటే.. ప్రజల సమస్యలపై చర్చించే నాయకులు లేకుండా పోయారని.. మేధావులు అంటున్నారు. ప్రస్తుతం ప్రజలు నిత్యావసరాల ధరలు పెరిగి అనేక ఇబ్బందులుఎదుర్కొంటున్నారు.. చెత్తపన్ను, ఓటీఎస్ వంటి సమస్యలపై గగ్గోలు పెడుతున్నారు. ఇక, యువత ఉద్యోగా కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఆయా సమస్యలను పట్టించుకోకుండా.. సభలో ఏకపక్షంగా చర్చలు చేయడం.. అంతా బాగుందనే ఫీల్ తో ఉండడం మంచిది కాదని అంటున్నారు.

గతంలో ఇలా చేసే అధికార పక్షం దెబ్బతిన్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇదే తీరుతో వెళితే జగన్ 2024 ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో పతనం కాక తప్పదన్న విమర్శలే వస్తున్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా..ప్రతిపక్షానికి మాట్లాడే సమయం ఇవ్వాలని.. వారిని సస్పెండ్ చేయడమే హక్కుగా భావించరాదని.. కూడా హితవు పలుకుతున్నారు.

Discussion about this post