ఔను! ఇప్పుడు టీడీపీలో ఎవరిని కదిలించినా.. ఇదే వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు నుంచి.. అనేక మంది పనిచేస్తున్నారు..ఈ క్రమంలో అసెంబ్లీలో చంద్ర బాబు చేసిన శపథాన్ని నెరవేర్చేందుకు పార్టీలో యువత అయితే.. శక్తికి మించి పనిచేస్తోందనే చెప్పాలి. చంద్రబాబు కోసం.. చంద్రబాబుతోనే.. అనే విధంగా వారు పనిచేస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న బెదిరింపులను కూడా లెక్కచేయడం లేదు. అంతేకాదు.. కేసులను కూడా పట్టించుకోకుం డా.. పార్టీకోసం రోడ్డెక్కుతున్నారు.

ఈ నేపథ్యంలో గతంలో పదవులు అనుభవించిన వారు.. ఇప్పటికీ.. పదవుల కోసం.. పోరాడుతున్నవారు.. చాలా మంది ఉన్నా.. వీరికన్నా ఎక్కువగా నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవానీ, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, వేగశ్న నరేంద్ర వర్మ, వంగలపూడి అనిత, బొండా ఉమా.. వంటి యు వత అంతా.. కూడా భారీ ఎత్తున రోడ్డెక్కుతున్నారు. నిజానికి వీరికి ఇప్పటి వరకు ప్రజలు ఇచ్చిన పదవులే ఉన్నాయి. ఎప్పటి నుంచోపార్టీలో ఉన్నా.. అధికారంలో ఉన్నప్పుడు కూడా వీరికి ఎలాంటి పదవులు దక్కలేదు.

అయినా.. కూడా వీరంతాఇప్పుడు.. ఏం జరిగినా.. సిద్ధమే అన్నట్టుగా.. పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయి తే.. బాధేంటి.. పార్టీ కోసమే కదా.. అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది.. అసలు కిటుకు.. పిల్ల చీమల న్నీ కలిసి కూడబెట్టిన ఆహారాన్ని పెద్ద చీమలు తినేసినట్టుగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. చోటా నేతలు.. కార్యకర్తలు, యువత తెగించి పోరాటాలు చేసి.. పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత.. మంత్రి పదవులు సహ.. ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులు దక్కించుకునేందుకు ప్రస్తుతం కలుగుల్లో దాక్కున్న పెద్ద నేతలు క్యూ కడతారు.

తగుదునమ్మా.. అంటూ.. చంద్రబాబుకు వల విసిరి.. కులాలు.. మతాల పేరుతో.. పదవులు దక్కించుకునే ప్రయత్నాలుచేయడం గత 2014లోనూ చూశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదే విషయంలో యువ నేతల్లోనూ చర్చకు వస్తోంది. అయితే.. చంద్రబాబు.. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తున్నారని.. పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారు.. ఎవరు తెగించి పనిచేస్తున్నారు.. అనే విషయాలను బట్టి.. వచ్చే అధికారంలో పదవులు పంచుతారని.. యువత ఆశలు పెట్టుకున్నారు. మరి .. చంద్రబాబు వీరికి ఆదిశగా భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే.. పనిమాది.. అనుభవించేది వేరేవారు.. అనే టాక్ పెరిగితే.. మరింత ఇబ్బంది తప్పదని అంటున్నారు. మరి ఏం చేస్తారోచూడాలి.

Discussion about this post