వైసీపీ కంచుకోట అయిన మాచర్ల నియోజకవర్గంలో సైకిల్ సారథులు వరుసపెట్టి మారుతూనే ఉన్నారు. ఈ సారి ఎలాగైనా మాచర్లలో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు…సరైన నాయకుడుని ఎంచుకోవడానికి ఎక్కువ సమయమే తీసుకున్నారు. అసలు దాదాపు రెండు దశాబ్దాల నుంచి మాచర్లలో టీడీపీకి విజయం దక్కని విషయం తెలిసిందే. ఏదో చివరిగా 1999 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది…మళ్ళీ అక్కడ నుంచి ఎప్పుడు టీడీపీ గెలవలేదు. 2004, 2009, 2012(ఉపఎన్నిక), 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూనే ఉంది.

వరుసపెట్టి అభ్యర్ధులని మార్చిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవా కొనసాగుతూనే ఉంది. అయితే 1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున చివరిగా జూలకంటి దుర్గాంబ మాచర్లలో గెలిచారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో దుర్గాంబ తనయుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.

దీంతో ఆయనని పక్కనబెట్టి 2012 ఉపఎన్నికలో చిరుమామిళ్ల మధు బాబుని నిలబెట్టారు.. కానీ ఆయన కూడా ఓడిపోయారు. 2014లో కొమ్మారెడ్డి చలమారెడ్డి, 2019 ఎన్నికల్లో అన్నపురెడ్డి అంజిరెడ్డిలకు సీట్లు ఇచ్చిన ఓడిపోయారు. అయితే ఆ మధ్య చలమారెడ్డిని మళ్ళీ ఇంచార్జ్‌గా పెట్టారు. అయినా సరే పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మళ్ళీ జూలకంటి బ్రహ్మానందరెడ్డికి ఇంచార్జ్ పదవి ఇచ్చారు. అయితే జూలకంటి ఫ్యామిలీకి నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. గ్రౌండ్ లెవెల్‌లో బలం ఉంది.

అందుకే మళ్ళీ ఆ ఫ్యామిలీకే ఇంచార్జ్ పదవి ఇచ్చారు. ఉపఎన్నికలో ఓడిపోయిన చిరుమామిళ్ల మధు బాబుకు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవి ఇచ్చారు. ఈ విధంగా మాచర్లలో టీడీపీని సెట్ చేశారు. అయితే ఇక్కడ నుంచి జూలకంటి ఎక్కువ కష్టపడాలి. పిన్నెల్లి లాంటి బలమైన నాయకుడుని ఢీకొట్టడం అంత సులువు కాదు. కాబట్టి ఎక్కువ కష్టపడితేనే నెక్స్ట్ ఎన్నికల్లో ఫలితం ఉంటుంది.


Discussion about this post