ఏదేమైనా కృష్ణా-గుంటూరు జిల్లాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలు హైలైట్ అయినట్లుగా…వేరే జిల్లాల్లోని ఎమ్మెల్యేలు పెద్దగా హైలైట్ కావడం లేదనే చెప్పొచ్చు. వివాదాలు, ఆరోపణలు అన్నీ ఈ రెండు జిల్లాల ఎమ్మెల్యేలు చుట్టూనే ఎక్కువ తిరుగుతున్నాయి. ఈ రెండు జిల్లాల ఎమ్మెల్యేలపై ఇప్పటికే అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక, ఇళ్ల స్థలాలు, అక్రమ మైనింగ్…అబ్బో ఒకటి ఏంటి అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

అలాగే ఎమ్మెల్యేలుగా మంచి పనితీరు కనబర్చడంలో కూడా వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా టిడిపి ఆఫీసుపై దాడి విషయంలో కావొచ్చు….టిడిపి అధినేత చంద్రబాబుని తిట్టే విషయంలో కావొచ్చు ఈ రెండు జిల్లాల ఎమ్మెల్యేలే ముందు వరుసలో ఉంటున్నారు. ఇలా అన్నీ రకాలుగా హైలైట్ అవుతున్న ఈ రెండు జిల్లాల ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో రీసౌండ్ మాత్రం గట్టిగా వస్తుందని టిడిపి శ్రేణులు అంటున్నాయి.

ఇప్పటికే రాజధాని అమరావతి అంశం వారికి షాక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే అంశం వారి పాలిట శాపం మాదిరిగా మారుతుందని చెబుతున్నారు. ఇక వీరిపై అనేక అక్రమ, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీని వల్ల ప్రజల్లో కూడా నెగిటివ్ పెరుగుతుంది. అటు ప్రతిపక్ష టిడిపిపై ఏ రేంజ్‌లో కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు కూడా చూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో టిడిపిపై కాస్త సానుభూతి పెరిగింది.

ఈ పరిణామాలని బట్టి చూస్తే నెక్స్ట్ ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి బొమ్మ కనబడుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో రెండు జిల్లాల్లో ఉన్న 33 సీట్లలో వైసీపీ 29 సీట్లు గెలుచుకుంది. అలాగే ఆ తర్వాత టిడిపి నుంచి వైసీపీ వైపు ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లారు….అంటే 31 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికలోచ్చేసరికి ఇందులో సగంపైనే ఎమ్మెల్యేలు ఓటమి బాట పట్టక తప్పదని అంటున్నారు.

Discussion about this post