ఏపీ మంత్రుల లో చాలామందికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ టెన్షన్ అప్పుడే పట్టుకుందట. ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో మంత్రులు గా ఉన్న వారిలో ముగ్గురు… నలుగురు మంత్రులు మినహాయించి మిగిలిన వారందరూ బయట ఎక్కడా కనిపించని పరిస్థితి. కొడాలి నాని – పేర్ని నాని – పెద్దిరెడ్డి లాంటి ఇద్దరు ముగ్గురు మంత్రులు మినహా మిగిలిన వారు మీడియా ముందు ఎక్కడ కనపడటం లేదు. వారి వాయిస్ ఎక్కడ వినపడటం లేదు. చివరకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం గత ఏడాది కాలంగా ఎందుకు ? సైలెంట్ గా ఉన్నారో తెలియడం లేదు. మంత్రుల బాధలు చాలానే ఉన్నాయి. అయితే నోరు తెరిచి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు.

సంక్రాంతి తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే ఇప్పుడున్న మంత్రుల్లో ముగ్గురు నలుగురు మినహా అందరి మంత్రి పదవులు ఊడిపోనున్నాయి. ఇదే పెద్ద షాక్ అనుకుంటే ఇప్పటివరకు మంత్రులుగా ఉండి తాము చేసింది కూడా ఏమీ లేదని వారు వాపోతున్నారు. చివరకు తమ నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు కూడా కాలేదని మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కొందరు మంత్రులకు అసలు ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కవన్న సంకేతాలు కూడా వచ్చేసాయ్ అట.

ఈ విషయం కూడా మంత్రులకు ముందుగానే లీక్ అవడంతో మంత్రిగా ఉండి వెలగబెట్టింది ఏమీ లేదు… వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా లేకపోతే పార్టీ కోసం ఎందుకు ? కష్టపడాలి అంటూ వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. అందుకే చాలా మంది మంత్రులు ఉన్నంతోనే ముందుగానే పెట్టె చక్క పెట్టేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసి.. చివరకు నియోజకవర్గాలను కూడా పట్టించుకోవడం వదిలేశారట. ఏదేమైనా వైసిపి అధిష్టానం ఎంత పెద్ద పదవిలో ఉన్న వారికి అయినా ఇప్పుడు ఇలాంటి షాక్ ఇస్తుందో తెలియని పరిస్థితి.

Discussion about this post