రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్న జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా..ఈ జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. అందుకే ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ప్రధాన పార్టీలన్నీ చూస్తాయి. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆటోమేటిక్ గా రాష్ట్రంలో అధికారం సాధించడం సులువు అని భావిస్తారు. 2014 ఎన్నికల్లో టిడిపి ఎక్కువ సీట్లు సాధించగా, 2019 ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ సీట్లు సాధించింది.
ఈ సారి ఎవరికి వారు ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ఇక్కడ ఊహించని ట్విస్ట్‌లు ఉన్నాయి..ఎందుకంటే ఇక్కడ జనసేన ప్రభావం ఉంది. టిడిపి-వైసీపీ-జనసేన ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. కానీ టిడిపి-జనసేన పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. అదే జరిగితే వైసీపీకి చెక్ పడటం ఖాయం.

కాకపోతే పొత్తు ఉంటే ఏ సీటు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది. ఇప్పటికే టిడిపిలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. పలు సీట్లలో పోటీ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి అక్కడ టిడిపికి నలుగురు సిట్టింగులు ఉన్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట, పెద్దాపురం..ఈ సీట్లు మళ్ళీ టిడిపికే దక్కవచ్చు. రూరల్ సీటు కాస్త డౌట్..అక్కడ జనసేనకు బలం ఉంది. ఇక జగ్గంపేట, తుని లాంటి సీట్లు టిడిపికే దక్కవచ్చు., రాజోలు సీటు జనసేనకే. కానీ అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, కొత్తపేట, రాజానగరం, కాకినాడ సిటీ, రూరల్ సీట్లపై క్లారిటీ లేదు.
ఇక అనపర్తి, ప్రత్తిపాడు సీట్లు టిడిపికే దక్కే ఛాన్స్ ఉంది. రామచంద్రాపురం సీటుపై క్లారిటీ లేదు. ఇలా తూర్పు సీట్లపై క్లారిటీ రావడం లేదు. పొత్తు ఉంటే ఏ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.
