టీడీపీ. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏపీలో 1982, మార్చి 29న ఉద్భవించిన పార్టీ. ఆనాడు.. దివంగత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి ఘన చరిత్ర ఉంది. అనేక ఎత్తు పల్లాలు చవిచూసిన పార్టీగానే కాకుండా.. అనేక రికార్డులు సృష్టించిన పార్టీగా కూడా టీడీపీ ఒక చరిత్ర సృష్టించింది. “ముఖానికి రంగేసుకునేవారు రాజకీయాలు ఏం చేస్తారు!“ అన్న ఈసడింపుల నుంచి అప్రతిహత విజయంతో ఉమ్మడి ఏపీ నుంచి నవ్యాంధ్ర వరకు పాలన సాగించిన పార్టీ ఒక రికార్డును సొంతం చేసుకుంది. అనేక మందినాయకులను ఈ పార్టీ తయారు చేసింది.

జాతీయస్థాయిలో తన స్వరం వినిపించింది. జాతీయస్థాయిలో చక్రం తిప్పింది. ఆనాడు ఎన్టీఆర్ ఉన్నా.. నేడు చంద్రబాబు ఉన్నా..టీడీపీకి జాతీయస్థాయిలో ఒక గుర్తింపు వచ్చిందంటే.. ఈ ఇద్దరు నాయకుల కృషి ఫలితంగానే. ఏమాత్రం హిందీపై పరిజ్ఞానం లేని.. ఒక దళిత నాయకుడు. మోహన చంద్ర బాలయోగిని.. లోక్‌సభ స్పీకర్ వంటి స్తానంలో కూర్చోబెట్టిన పార్టీ టీడీపీ. అసలు మహిళకు.. స్పీకర్ పదవి ఏంటి? అనుకునే సమయంలో దళిత మహిళానాయకురాలు.. ప్రతిభాభారతిని.. ఏపీ అసెంబ్లీకి స్పీకర్ ను చేసిన ఘనత కూడా ఈ పార్టీకే దక్కుతుంది.

మీరు అన్ని విధాలా .. అర్హులు .. అంటూ.. నాడి నేషనల్ ఫ్రంట్ సమయంలో ప్రధాన మంత్రి పోస్టును ఆఫర్ చేస్తే.. కాదని.. ఏపీకే పరిమితమైన అన్నగారు.. ఎన్డీయే హయాంలో మీకు మాత్రమే ప్రధాని పదవి సూటవుతుందని..అన్నా.. కాదన్న చంద్రబాబు.. ఈ పార్టీకి ఎప్పటికీ.. ఐకాన్‌లే! జాతీయ పార్టీలు మాత్రమే కేంద్రంలో చక్రం తిప్పగలవన్న.. ద్రుఢ నమ్మకాన్ని బదాబదలు చేసిన.. ఘనత కూడా ఈ నేతలే సొంత చేసుకున్నారు అన్నగారి హయాంలోను.. చంద్రబాబు హయాంలోనూ.. కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటములు ఏర్పాటు చేసి.. అధికారంలోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు.

ఇలాంటి పార్టీ ఇప్పుడు 40 ఏళ్లు పూర్తి చేసుకుని.. అత్యంత కీలకమైన దశలోకి చేరుతోంది. వచ్చే ఎన్నికల్ల ఎలా గెలవాలి.. ఏ విధంగా అధికారంలోకి రావాలి.. అనే విషయాలు.. చర్చ జరుగుతున్నా.. ఇంత పెద్ద సుదీర్ఘ చరిత్రను సొంతం చేసుకున్న పార్టీకి.. అధికారమే పరమావధి కాదని… ప్రజల శ్రయేస్సును ప్రధానంగా చూడాలని .. అంటున్నారు మేదావులు. ప్రజలను నమ్ముకున్న.. ప్రజలు నమ్ముకున్న పార్టీగా.. చిరస్థాయిగా నిలిచిపోవాలంటే.. మళ్లీ.. ప్రజామార్గం పట్టాల్సిందేనని చెబుతున్నారు.

Discussion about this post