May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

ఎచ్చెర్లలో కిరణ్ పని అవుట్..టీడీపీ విక్టరీ ఫిక్స్!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల  నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట..టీడీపీ అద్భుతమైన విజయాలు సాధించిన స్థానం. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ ఊహించని విధంగా టి‌డి‌పికి ఎదురు దెబ్బ తగిలింది. టి‌డి‌పి సీనియర్ నేత కళా వెంకట్రావు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి గోర్లే కిరణ్ కుమార్ పోటీ చేసి గెలిచారు. దాదాపు 18 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు.

అయితే 2014లో కిరణ్ 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో కిరణ్ విజయం సాధించారు. స్వతహాగా కిరణ్ కు సొంత ఇమేజ్ పెద్దగా లేదు. టి‌డి‌పి సీనియర్ కళా వెంకట్రావుకు ఉన్న ఫాలోయింగ్ లేదు. కానీ జగన్ గాలిలో గత ఎన్నికల్లో గెలిచారు. పోనీ అలా గెలిచాక సొంత బలాన్ని పెంచుకుంటున్నారా? అంటే అది లేదు.  అక్కడ ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యం..ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తప్ప..ఎచ్చెర్ల ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. దీంతో ఆయనపై వ్యతిరేకత కనిపిస్తుంది

.

ఈ సారి మాత్రం కిరణ్ గెలిచే పరిస్తితి లేదని అక్కడి ప్రజలు మాట్లాడుకునే పరిస్తితి. ఇటీవల సర్వేల్లో కూడా అక్కడ టి‌డి‌పి గెలవడం ఖాయమని తేలింది. ఇక టి‌డి‌పి నుంచి కళా వెంకట్రావు ఉన్నారు. అటు కలిశెట్టి అప్పలనాయుడు సైతం ఎచ్చెర్ల టి‌డి‌పి సీటు కోసం ట్రై చేస్తున్నారు.

దీంతో ఎచ్చెర్లలో టి‌డి‌పి లో కాస్త వర్గ పోరు ఉంది. అయితే చంద్రబాబు..సీనియర్ నాయకుడు అయిన కళాని కాదని కలిశెట్టికి సీటు ఇస్తారా? అనేది చూడాలి. కాకపోతే ఈ మధ్య గెలిచే సత్తా ఉన్నవాళ్లకే బాబు సీటు ఇస్తున్నారు. దీంతో సర్వే చేసుకుని ఎవరోకరికి సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఎవరికి సీటు ఇచ్చిన కలిసి పనిచేస్తే ఎచ్చెర్లలో టి‌డి‌పి జెండా ఎగరడం ఖాయం.