June 8, 2023
Uncategorized

ఏలూరు ఎంపీ సీటులో కొత్త క్యాండిడేట్..!

ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలవడమే కాదు…ఎంపీలు గెలవడం కూడా కీలకంగా పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేస్తున్నారు. ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రంలో కాస్త పట్టు దొరుకుతుంది. అందుకే ఎంపీ సీట్లపై కూడా ఎక్కువ ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. పైగా ఎంపీ బట్టే ఎమ్మెల్యే అభ్యర్ధుల గెలుపు అవకాశాలు కూడా కాస్త ఉంటాయి. కాబట్టి ప్రతి ఎంపీ సీటు ముఖ్యమే. ఈ సారి ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

అయితే గత ఎన్నికల్లో టీడీపీ 3 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచింది..ఈ సారి  మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు. కాకపోతే టీడీపీకి ఇంకా పలు స్థానాల్లో సరైన అభ్యర్ధులు లేరు. అనకాపల్లి, అరకు, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కడప లాంటి సీట్లలో టీడీపీకి అభ్యర్ధులు లేరు. అయితే ఇప్పుడుప్పుడే  ఆ సీట్లపై బాబు ఫోకస్ చేసి పనిచేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కొన్ని స్థానాల్లో నాయకులని పెట్టారు. ఇంకా కొన్ని స్థానాల్లో నాయకులని నియమించాల్సి ఉంది.

ఈ క్రమంలోనే ఏలూరు పార్లమెంట్ లో కొత్త అభ్యర్ధిని పెట్టడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ మాగంటి బాబు ఉన్నారు..గత ఎన్నికల్లో ఓడిపోయాక కాస్త ఫ్యామిలీ ఇబ్బందుల వాళ్ళ యాక్టివ్ గా లేరు. పైగా వయసు కూడా మీద పడటంతో సరిగ్గా పనిచేయట్లేదు. కానీ ఇటీవల కాస్త దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు.

అయినా సరే ఈ సారి మాత్రం ఆయనని పక్కన పెట్టాలని బాబు చూస్తున్నారట. టీడీపీలో ఏదైనా ముఖ్య పదవి ఇచ్చి..ఏలూరు ఎంపీ సీటు మరొక నేతకు ఇవ్వాలని చూస్తున్నారట. వాస్తవానికి బోళ్ళ రాజీవ్ గత ఎన్నికల్లో సీటు కోసం ట్రై చేశారు. కానీ ఇప్పుడు యాక్టివ్ గా లేరు. ఇదే క్రమంలో మాగంటి బంధువు కొమ్మారెడ్డి రాంబాబుకు ఎంపీ సీటు ఇవ్వాలని చూస్తున్నారని తెలిసింది. మరి బాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video