టీడీపీ అధినేత చంద్రబాబు ఇకపై దూకుడుగా రాజకీయం చేసేలా ఉన్నారు…ఇంతకాలం సరిగ్గా పార్టీలో లోపాలని పెద్దగా సరిచేయని బాబు…ఇక నుంచి పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ముందుకెళ్లెలా ఉన్నారు. పార్టీకి డ్యామేజ్ చేసే నాయకులని మొహమాటం లేకుండా పక్కన పెట్టేలా ఉన్నారు. ఇప్పటికే పార్టీలో ఉంటూ పక్క పార్టీలకు సహకరించే నేతలని పార్టీలో నుంచి తప్పిస్తానని చెప్పేశారు. కోవర్టులని ఏరిపారేస్తానని అన్నారు. అలాగే పార్టీలో పనిచేయని నాయకులని కూడా సైడ్ చేసేస్తానని చెప్పారు.

అయితే పార్టీలో సరికొత్త మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళుతున్న బాబు..ఇంకా పార్టీలో మార్పులు చేయాల్సిన అవసరముంది. పలు చోట్ల ఇంకా పార్టీకి నాయకులు లేరు….అక్కడ నాయకులని నియమించాల్సి ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో పార్టీకి సరైన నాయకులు లేరు. అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి నాయకులు ఎవరో కూడా క్లారిటీ లేదు.

ఏలూరు, నరసాపురం పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి నేతలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఏలూరులో మాగంటి బాబు పోటీ చేసి ఓడిపోయారు…ఇప్పుడు ఆయన పార్టీలో యాక్టివ్ గా లేరు. ఫ్యామిలీలో ఉన్న ఇబ్బందులు వల్ల…ఆయన ఇంకా రాజకీయాల్లో కనిపించేలా లేరు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన మళ్ళీ చేయడం కష్టమే అని చెప్పాలి. కాబట్టి ఏలూరులో టీడీపీకి నాయకుడు కావాలి. అటు నరసాపురంలో సైతం టీడీపీకి నాయకుడు లేరు.

గత ఎన్నికల్లో వేటుకూరి శివరామరాజు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఈయన పార్టీలో యాక్టివ్ గా లేరు. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల ముందు యాక్టివ్ అయినా సరే…ఉండి అసెంబ్లీలో పోటీ చేయడానికి వేటుకూరి రెడీ అవుతున్నారు. అలాంటప్పుడు నరసాపురం పార్లమెంట్‌లో లీడర్ కావాలి. అయితే ఇక్కడ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు…టీడీపీలోకి వచ్చి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో నెక్స్ట్ ఎన్నికల ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Discussion about this post