సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు గ్రామం ఉన్న పామర్రు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఇంతవరకు ఎగరలేదు. వరుసగా ఓడిపోతూ వస్తుంది. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చింది. 2014లో గెలుపు వరకు వచ్చి వెయ్యి ఓట్ల తేడాతో ఓడింది. కానీ 2019లో మాత్రం 30 వేల ఓట్ల మెజారిటీతో టిడిపి ఓడిపోయింది. అయితే రాష్ట్రంలో వైసీపీకి యాంటీ వస్తుంది. అదే సమయంలో పామర్రు వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్..పరిస్తితి కూడా ఇందుకు భిన్నంగా లేదు.
ఆయనకు యాంటీ ఎక్కువగానే ఉంది. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి లేదు..రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో సరైన నీటి సౌకర్యం లేదు. ఏదో పథకాలు తప్ప..అక్కడ ప్రజలకు ఒరిగింది లేదు. ఇక ఇసుక, ఇళ్ల స్థలాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యేపై ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యేకు నెగిటివ్. అయితే వైసీపీకి యాంటీ ఉన్నా సరే.అది టిడిపికి కలిసి రావడం లేదు. మూడుసార్లు ఓడిపోయిన సానుభూతి సైతం టిడిపిపై కనిపించడం లేదు. ఇక్కడ టిడిపికి వరుసగా నాయకులు మార్పులు ఇబ్బందిగా మారాయి.

వర్ల రామయ్య, ఉప్పులేటి కల్పన..ఇప్పుడు వర్ల తనయుడు కుమార్ రాజా టిడిపి ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో బాగానే తిరుగుతున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. కాకపోతే ఆర్ధిక అంశాల్లో కార్యకర్తలపైనే భారం మోపుతున్నారని తెలిసింది. అటు నియోజకవర్గంలో క్యాస్ ఈక్వేషన్స్ సైతం వేరుగా ఉన్నాయి.
ఇక్కడ ఎస్సీ వర్గం హవా ఎక్కువ..ఆ వర్గం ఎక్కువగా వైసీపీ వైపే మొగ్గు చూపుతుంది. దీని వల్ల టిడిపికి ప్లస్ అవ్వట్లేదు. అటు బిసి వర్గం ఫిఫ్టీ-ఫిఫ్టీగా ఉంది. మెజారిటీ బిసి వర్గాన్ని తిప్పుకుంటే టిడిపికి గెలుపు ఖాయం. కాకపోతే ఇప్పుడు వైసీపీకే స్వల్ప లీడ్ ఉంది. టిడిపి ఇంకా కష్టపడితేనే పామర్రు దక్కుతుంది. లేదంటే మళ్ళీ కష్టమే.