ఈ ఫొటో చూశారుగా! కొత్తగా ఏర్పడిన జగన్ 2.0 కేబినెట్‌లోనూ చోటు దక్కించుకున్న ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లాకు చెందిన రామచంద్రపురం నియోజకవర్గం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరామ్‌గా.. సెక్యూరిటీని పక్కన పెట్టుకుని మరీ.. దోశలువేస్తున్నారు. అంతేకాదు.. అక్కడున్న వారిని టేస్ట్ చూడాలని కూడా ఆయన ప్రోత్సహించారు. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.. “మంత్రిగారికి ఇంకే పనిలేనట్టుందే!“ అని కొందరు వ్యాఖ్యానించారు.

మరికొందరు మాత్రం… `ముందే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు“ అని ఒకింత కటువుగానే వ్యాఖ్యలు చేశారు. అంటే..వచ్చే ఎన్నికల్లో ఎలానూ ఆయన ఓడిపోతారని.. తర్వాత ఎలాగూ.. హొటల్ పెట్టుకునే ప్లాన్‌లో ఉన్నారేమో.. అందుకే ఇలా ముందుగానే.. ప్రాక్టీస్ చేస్తున్నారు.. అని కామెంట్లు చేశారు. ఇక, సామాన్యుల విషయానికి వస్తే.. సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా బాగానే ఎంజాయ్ చేస్తున్నారని.. అంటున్నారు. ప్రజల సొమ్ముతో భద్రత ఏర్పాటు చేసుకుని.. మరీ దోశలు పోస్తున్నారంటే.. ఆయనకు పనిలేనట్టుగా ఉందన్నారు.

సీఎం జగన్ ఇలాంటివారిని ఎందుకు పక్కన పెట్టరు? అని ఓ యువతి కామెంట్ చేసింది. ఇక, సమాజం పట్ల బాధ్యత లేదా? అని ఒకరిద్దరు వ్యాఖ్యానించారు. “ఇటు తూర్పుగోదావరిలో చాలా పనులు మిగిలిపోయాయి. రోడ్లు బాగోలేదు. అర్హులైన వారికి పింఛన్లు అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పథకాలపైనా.. ఆయన ప్రజల నుంచి సమాచారం తీసుకోవచ్చు. ప్రజల్లోకి రావొచ్చు. కానీ, ఇలా దోశలు పోయడంఏంటి సార్.. ఇప్పుడేమైనా ఎన్నికలు ఉన్నాయా?“ అని మధ్య తరగతి మానవడు.. పెదవి విరిచాడు.

ఇలా మొత్తంగా.. మంత్రి చెల్లుబోయిన.. చేసిన పనిని నెటిజన్లు ఒక్కరంటే ఒక్కరు కూడా స్వాగతించలే దు. సరే… ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం సమాచార శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన.. ఆదివారం.. తన నియోజకవర్గంలో పర్యటించారు. అయితే..ఆయన కార్లు.. గట్రా ఏమీ లేకుండా.. సాదాసీదాగా.. రోడ్డు వెంట నడుస్తూ.. ఓ 10 కిలో మీటర్ల మేర.. పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను కాకుండా..రోడ్డు పక్కన ఉండే… బడ్డీ కొట్ల దగ్గర కాలక్షేపం చేశారు. ఇరానీ చాయ్ రూ.10 ఇచ్చి కొని తాగారు(పక్కవాళ్లకు ఇప్పించలేదనే కామెంట్లు కూడా వచ్చాయి). తర్వాత.. ఇలా ఓ హోటల్‌కు వెళ్లి దోశ పిండి కలిపి ఓ నాలుగు దోశలు వడ్డించారు. దీనిపైనే నెటిజన్లు కామెంట్లతో ఇరగదీశారు.

Discussion about this post