ఏపీలో 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీస అంచనాలను అందుకోలేక పోయింది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి చేసిన దుష్ప్రచారం టీడీపిని దెబ్బ కొట్టింది. అలాగే జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే ఎలా ? ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా డిసైడ్ అయి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 175 సీట్లలో వైసిపి 153 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం 23 సీట్లతో సరిపెట్టుకుంది. జనసేన ఒక్క రాజోలులో మాత్రమే గెలిచింది.

ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి. 2024 సాధారణ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ పాలన మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు ? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉంటుంది ? అన్న దానిపై సర్వేలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వైసిపికి అనుకూలంగా ఉన్న ఒక సర్వే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం గెలిచే స్థానాలు 23 నుంచి 60 పెరుగుతాయని చెప్పింది.

అయితే ఇప్పుడు తెలుగుదేశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓ టీమ్ ఏర్పాటు చేసుకుని వైసీపీ పాలన ఎలా ఉంది ? జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారా ? ప్రభుత్వ పథకాలతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారా ? అని సర్వే చేయించిందట. ఈ సర్వేలో జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు రెండున్నర సంవత్సరాలకే విసిగిపోయి ఉన్నారని తేలిందట. ఒకటి రెడు వర్గాలు మినహా అందరూ కూడా జగన్ అంటే మండిపోతున్నట్టు తేలింది.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 175 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని స్పష్టమైందట. కృష్ణా , గుంటూరు, ప్రకాశంతో పాటు గోదావరి జిల్లాల్లో వైసీపీకి చుక్కలు కనపడతాయట. ఇక కడపలో రెండు, కర్నూలులో 6, చిత్తూరులో నాలుగు సీట్లు టీడీపీకి వస్తాయని కూడా తేలిందని ఈ సర్వేలో తేలిందట. ఏదేమైనా వైసీపీ ప్రభుత్వానికి అప్పుడే డేంజర్ బెల్స్ అయితే మోగుతున్నాయి.

Discussion about this post