మంత్రి పదవులు దక్కలేదని కొందరు.. ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మంత్రి పదవులు దక్కిం చు కున్నామన్న ఆనందంలో వేస్తున్న అడుగులు రాంగ్ పడి.. ఏకంగా.. సీఎం జగన్‌కు ఇబ్బందికర పరి స్థితిని తీసుకువస్తోంది. ఇద్దరు కీలక మంత్రులు చేసిన వ్యాఖ్యలు.. వ్యక్తిగతంగా వారికి ఎలాంటి డ్యామేజీ ఇచ్చిందో తెలియదు కానీ.. ప్రభుత్వం పరంగా.. జగన్‌కు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఆ ఇద్దరూ కూడా.. ప్రతిపక్షాలకు ఆయుధాలు అందించే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదే విషయం వైసీపీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఇప్పటి వరకు.. సీఎం జగన్ తన పాలనను అవినీతిరహితంగా చేస్తున్నామని.. ఎక్కడా లంచాలు.. లేకుండా ముందుకు సాగుతున్నామని… ప్రతి ఒక్క విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని.. పదే పదే చెబుతున్నారు. ఇదే.. ఆయ నకు చాలా వరకు మైలేజీ తీసుకువచ్చింది. గతంలో ఉన్న మంత్రులుకూడా ఇదే విషయాన్ని చెప్పేవా రు. అవినీతికి తావులేని విధంగా పాలన అందిస్తున్నామని చెప్పేవారు.

అయితే.. అనూహ్యంగా..ఇప్పుడు తాజాగా కేబినెట్‌లో బాధ్యతలు చేపట్టిన మంత్రులు సంచలన వ్యాఖ్య లు చేశారు. ఒకరు ధర్మాన ప్రసాదరావు కాగా.. మరొకరు కొట్టు సత్యనారాయణ. ధర్మాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. వెంటనే శ్రీకాకుళం వెళ్లారు. అక్కడ మాట్లాడుతూ.. రెవెన్యూ లో అవినీతి పెరిపోయిందని.. అవినీతి లేని పాలన అందిద్దామని.. వ్యాఖ్యానించారు. ఇవి.. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఇప్పటి వరకు అవినీతి లేకుండా పాలన అందిస్తున్న ప్రభుత్వం ఇబ్బంది పడింది.

సొంత మంత్రి ఇలా వ్యాఖ్యానించడం.. దారుణంగా మారిందనే వ్యాఖ్యలు పార్టీలోనూ వినిపిస్తున్నాయి. మరోవైపు.. దేవదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొట్టు సత్యనారాయణ.. వెంటనే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవదాయ శాఖలో అవినీతి తాండవిస్తోందన్నారు. నిజానికి ఈయన ఇలా మాట్లాడుతు న్నప్పుడు.. మాజీ దేవదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కనే ఉన్నారు. అయినప్పటికీ.. మంత్రి కొట్టు ఎక్కడా తగ్గలేదు.

దీంతో అధికారుల కూడా ఉలిక్కి పడ్డారు. తాను అవినీతిని సహించని.. అరికడతాననని.. మంత్రి చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం కూడా సీరియస్ అయిందని సమాచారం. మొత్తానికి ఈ ఇద్దరు మంత్రుల వ్యవహారం.. పార్టీలో తీవ్రచర్చనీయాయంశం కావడం గమనార్హం.

Discussion about this post