రాష్ట్రంలో పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో నిదానంగా వైసీపీ బలం తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీకి ఆధిక్యం వచ్చింది. జిల్లాలో 19 సీట్లు ఉంటే వైసీపీకి 14 సీట్లు వచ్చాయి. అంటే దాదాపు జిల్లాపై వైసీపీ హవా సాగినట్లే. అయితే వైసీపీ హవాని తగ్గించడానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్ తగ్గుతూ వస్తుంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ హవా తగ్గుతుంది.

అదే సమయంలో జిల్లాలో జనసేన కూడా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. జిల్లాలో జనసేనకు సైతం మంచి ఓటు బ్యాంక్ ఉంది. అయితే ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారితే వైసీపీకి చాలా ఇబ్బంది. అంటే టీడీపీ-జనసేనలు కలిస్తే వైసీపీకి గట్టి దెబ్బ తగులుతుంది. ఓ రేంజ్‌లో వైసీపీకి చెక్ పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే వైసీపీకి చాలా బెనిఫిట్ ఉంటుంది.

అయితే రాజకీయ సమీకరణాలతో పని లేకుండా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. వారికి చెక్ పెట్టడం అంత ఈజీ కాదనే చెప్పొచ్చు. తూర్పులో బలంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీశ్, కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్‌లో మంత్రి కన్నబాబు, రామచంద్రాపురంలో చెల్లుబోయిన వేణుగోపాల్, పి.గన్నవరంలో కొండేటి చిట్టిబాబులు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు.







అయితే టీడీపీ-జనసేనల కాంబినేషన్ సెట్ అయితే మాత్రం కొందరు ఎమ్మెల్యేలకు అనూహ్యంగా చెక్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇక టీడీపీ-జనసేన కలిసిన సరే కొందరు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లోకి వెళ్లారు. ఒకవేళ కలవకపోతే తూర్పులో వైసీపీ ఎమ్మెల్యేలకు ఫుల్ అడ్వాంటేజ్. అంటే టీడీపీ-జనసేనలు కలుస్తాయా లేదా అనే దాని బట్టే వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్ ఆధారపడి ఉంది.

Discussion about this post