అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఏదో సంక్షేమ పథకాల రూపంలో 10 రూపాయలు పంచి..పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి 100 రూపాయలు వరకు లాగేస్తున్నారు పైగా ఎక్కడకక్కడ అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. దీంతో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుంది. అటు ఎమ్మెల్యేలపై మరింత వ్యతిరేకత ఉంది. ఆఖరికి సొంత పార్టీ వాళ్ళే ఎమ్మెల్యేలని వ్యతిరేకిస్తున్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అలా సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురుకుంటున్న వారిలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కూడా ఒకరు. 2014లో స్వల్ప మెజారిటీ తేడాతో టిడిపి సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు చేతిలో ఓడిపోయిన కిరణ్..గత ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచేశారు. అలా గెలిచిన కిరణ్..సొంతంగా బలంగా పెంచుకోవడంలో విఫలమయ్యారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం తక్కువ. పైగా ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సొంత పార్టీ నేతలే..కిరణ్ వద్దు అంటూ ర్యాలీ తీశారు. నెక్స్ట్ కిరణ్‌కు సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు.

గత ఎన్నికల్లో కిరణ్ గెలుపు కోసం పనిచేసిన వారికి అన్యాయం చేశారని, తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కిరణ్‌కుమార్‌కు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని, అలా కాకుండా కిరణ్‌కు సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. సొంత పార్టీలోనే కాదు..ఈయనపై ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉంది.
ఇక వైసీపీపై వ్యతిరేకత టిడిపికి కలిసొస్తుంది. ఇక్కడ టిడిపి సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు పుంజుకుంటున్నారు. దాదాపు ఎచ్చెర్లలో టిడిపి లీడ్ లోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ టిడిపి గెలుపు ఖాయమని చెప్పవచ్చు.