ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండేవి..అధికార-ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకునే వారు…వ్యక్తిగతంగా ఎలాంటి రాజకీయం చేసేవారు కాదు..కానీ ఇదంతా కొన్నేళ్ళ క్రితం వరకే..అయితే ఎప్పుడైతే వైసీపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి రాజకీయం మారిపోయిందని విశ్లేషకులు మాట్లాడుకునే పరిస్తితి…అధికారం కోసం వైసీపీ చేసినట్లుగా ఫేక్ పాలిటిక్స్ మరో పార్టీ చేయలేదనే చెప్పొచ్చు అంటున్నారు. అసలు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఏ విధంగా రాజకీయ డ్రామాలు ఆడిందో అంతా చూశారు.

ఉదాహరణకు కోడి కత్తి డ్రామా, అలాగే వివేకానందరెడ్డి హత్య కేసు…ఈ రెండు చేసింది టీడీపీనే అని చెప్పి వైసీపీ ఏ స్థాయిలో ప్రచారం చేసిందో అందరికీ తెలిసిందే..అసలు ప్రశాంత్ కిషోర్ డైరక్షన్ లో వైసీపీ ఏ విధంగా ఫేక్ పాలిటిక్స్ నడిపిందో అందరికీ తెలిసిందే. సరే చివరికి వైసీపీ అధికారంలోకి వచ్చింది…అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ అదే విధంగా ముందుకెళుతుంది…ప్రతి దానికి చంద్రబాబుని టార్గెట్ చేసి, ఆయన్ని బూతులు తిట్టడమే చేస్తున్నారు. మధ్య మధ్యలో పవన్ కల్యాణ్ ని లాగి తిడుతున్నారు. పూర్తిగా వ్యక్తిగత కక్షతో రాజకీయం చేసినట్లు అందరికీ అర్ధమైంది.

అయితే ఈ ఫేక్ పాలిటిక్స్ చేయడం జగన్ ఆపుతున్నట్లు కనిపించడం లేదు…తాజాగా కూడా అమలాపురం అల్లర్లకు కారణం చంద్రబాబు, పవన్ కల్యాణ్ అన్నట్లు చెప్పుకొచ్చారు…అలాగే అమలాపురం జిల్లాకు అంబేడ్కర్ లాంటి మహనీయుడు పేరు పెడుతుంటే అడ్డుకుంటున్నారని అన్నారు. అసలు ఇక్కడే జగన్ చేసే విమర్శలకు అర్ధం లేదని చెప్పొచ్చు…ఎందుకంటే అలర్లకు కారణం ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.

అలాగే మొదట కోనసీమ అని పేరు పెట్టి మళ్ళీ అంబేడ్కర్ పేరు పెట్టి అగ్గికి ఆజ్యం పోసిందో ఎవరో తెలుసు. అదేదో అంబేడ్కర్ పేరు ముందే పెడితే ఏ రచ్చ ఉండేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…అసలు అంబేడ్కర్ పేరుని అటు టీడీపీ గాని, ఇటు జనసేన గాని వ్యతిరేకించలేదు…కేవలం జగన్ రాజకీయ లబ్ది కోసమే ఈ ఫేక్ పాలిటిక్స్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి ఫేక్ పాలిటిక్స్ చేయడంలో జగన్ ఆరిపోయినట్లే కనిపిస్తున్నారు.

Discussion about this post