May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

 ఫేక్ పాలిటిక్స్: వైసీపీ ఇంకా మారదా!

రాజకీయాలు ఎప్పుడు నేరుగా చేయాలి..ఉన్నది ఉన్నట్లుగానే అసలైన రాజకీయం..అలా కాకుండా ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, ప్రత్యర్ధులపై నిర్మాణాత్మకమైన విమర్శలు కాకుండా బూతులు తిట్టడం వైసీపీకి బాగా అలవాటు అయిన పని మాదిరిగా కనిపిస్తుంది. వైసీపీ రాజకీయాల్లోకి వచ్చాకే ఈ ఫేక్ పాలిటిక్స్, బూతులు ఎక్కువ అయ్యాయని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. గతంలో అధికారంలో ఉన్న టి‌డి‌పిపై ఉన్నది లేనట్లుగా వైసీపీ ప్రచారం చేసి ఏ మేరకు లబ్ది పొందిందో అందరికీ తెలిసిందే.

టి‌డి‌పిని దెబ్బతీయడానికి లేని అవినీతి ఆరోపణలు చేయడం, పింక్ డైమండ్ అని, ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇక కోడి కత్తి కేసు, వివేకా హత్య కేసులని సైతం టి‌డి‌పికి ఆపాదించడం చేసి వైసీపీ 2019 ఎన్నికల్లో బాగా లబ్ది పొందింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అవన్నీ ఫేక్ అని తేలిపోయింది. అయితే అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ ఈ ఫేక్ పాలిటిక్స్ వదలడం లేదు. ఏదైనా ఉంటే నేరుగా రాజకీయం చేసి తేల్చుకోవాలి..కానీ అలా కాకుండా ఫేక్ రాజకీయం చేస్తుంది.

ఇదే క్రమంలో తాజాగా టి‌డి‌పి-జనసేన పొత్తు విషయంలో వైసీపీ ఎలాంటి ఫేక్ పాలిటిక్స్ చేస్తుందో చెప్పాల్సిన పనిలేదు. టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే తమకు నష్టమని, అధికారం దక్కడం కష్టమని చెప్పి పొత్తు చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని చెబుతూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాగే టి‌డి‌పి, జనసేన నేతల పేరిట తాము సింగిల్ గా పోటీ చేస్తామని సోషల్ మీడియాలో ఫేక్ స్టేట్‌మెంట్లు పెడుతూ.. టి‌డి‌పి-జనసేన శ్రేణుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది. కానీ వైసీపీ ఫేక్ పాలిటిక్స్‌ని టి‌డి‌పి, జనసేనలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. గతంలో మాదిరిగా ఈ సారి వైసీపీ ఎత్తులు వర్కౌట్ అయ్యేలా లేవు.