ప్రకాశం జిల్లాలో వైసీపీ కంచుకోటల్లో కందుకూరు నియోజకవర్గం ఒకటి. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలుగా వైసీపీ జెండా ఎగురుతుంది. అయితే ఇప్పటికీ నియోజకవర్గంలో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ పరిస్తితి బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ జెండా ఎగిరేలా కనిపిస్తోంది. ఇప్పటికీ అక్కడ టీడీపీ పికప్ అవ్వడం లేదు. అసలు మామూలుగానే కందుకూరులో టీడీపీకి అంత పట్టు లేదు.

నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది కేవలం రెండు సార్లు మాత్రమే…1994, 1999 ఎన్నికల్లోనే టీడీపీ విజయం సాధించింది. ఇంకా ఎప్పుడు టీడీపీ కందుకూరులో గెలవలేదు. అంటే కందుకూరులో టీడీపీ బలం ఏంటి అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక గత రెండు పర్యాయలుగా ఇక్కడ వైసీపీ గెలుస్తూ వస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీనే విజయం సాధించింది.

అయితే 2014లో వైసీపీ తరుపున గెలిచిన పోతుల రామారావు టీడీపీలోకి వచ్చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆయనే టీడీపీ తరుపున నిలబడ్డారు. ఇక అనేక ఏళ్ళు కాంగ్రెస్‌లో పనిచేసిన మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీలోకి వచ్చి 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అంతకముందు ఈయన కాంగ్రెస్ తరుపున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు నాల్గవ సారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు.

అయితే ఈ రెండున్నర ఏళ్లలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చింది గానీ, మానుగుంటపై రాలేదు. ఈయనకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఈయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లరు. ప్రతిపక్ష నేతలపై నోరు వేసుకుని పడిపోరు. ఈయన పని ఈయన చేసుకుంటూ పోతారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు.

అందుకే కందుకూరులో మహీధర్ బలం తగ్గలేదు. ఇటు టీడీపీ పికప్ అవ్వలేదు. టీడీపీ తరుపున మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, దివి శివరాంలు పనిచేస్తున్నారు. ఇద్దరూ అంత దూకుడుగా లేరు. పైగా వచ్చే ఎన్నికల్లో వీరిలో ఎవరికి సీటు దక్కుతుందో తెలియకుండా ఉంది. కానీ ఏది ఎలా జరిగినా కందుకూరులో మళ్ళీ ఫ్యాన్ హవా నడిచేలా ఉంది.

Discussion about this post