శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లో పాతపట్నం కూడా ఒకటి అని చెప్పొచ్చు…గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీకి మంచి విజయాలు దక్కాయి. 2014, 2019 ఎన్నికల్లో పాతపట్నంలో వైసీపీ జెండా ఎగిరింది. ఇలా రెండు సార్లు గెలిచి సత్తా చాటిన వైసీపీ…మూడోసారి అంటే 2024 ఎన్నికల్లో గెలుస్తుందా? అంటే అబ్బే ఈ సారి గెలవడం అనేది అంత సులువు కాదని తెలుస్తోంది.

మళ్ళీ పాతపట్నంలో వైసీపీని గెలిపించాలని ప్రజలు మాత్రం అనుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీ వల్ల పాతపట్నం ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఉన్నారు…ఆమె రెండున్నర ఏళ్లలో పాతపట్నంలో చేసిన అభివృద్ధి లేదు. అందరికీ వచ్చినట్లే అర్హులైన వారికి పథకాలు వస్తున్నాయి…అంతే తప్ప ఎమ్మెల్యే శాంతి సెపరేట్‌గా పాతపట్నంలో చేసే అభివృద్ధి లేదు.

పైగా ఎక్కడకక్కడ వైసీపీ నేతల అక్రమాలు పెరిగిపోతున్నాయని టీడీపీ ఆరోపిస్తుంది..ఇసుక, మట్టి, మైనింగ్ ఇలా అన్నిటిలోనూ అక్రమాలు చేస్తున్నారని అంటున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలపై ఎంత భారం పడుతుందో చెప్పాల్సిన పని లేదు..ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పెంచేసిన విషయం తెలిసిందే…ఈ అంశంపై కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇక అటు టీడీపీ నేత కలమట వెంకటరమణ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు..నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.

అలాగే ఆ మధ్య నియోజకవర్గంలో జరిగిన హీరా జెడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వైసీపీ నుంచి నిలబడిన ఎమ్మెల్యే కుమారుడుని ఓడించి టీడీపీ సత్తా చాటింది…ఇక అక్కడ నుంచి పాతపట్నంలో సీన్ మారిపోయింది. అక్కడ ప్రజలు టీడీపీ వైపుకు వచ్చేస్తున్నారు. తాజాగా కూడా వైసీపీ నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. ఇలా పాతపట్నంలో సైకిల్ దూసుకుపోతుంది. నెక్స్ట్ ఈ సీటులో టీడీపీ సత్తా చాటేలా ఉంది.

Discussion about this post