ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలతో గాని జగన్ నెక్స్ట్ ఎన్నికలకు వెళితే చాలా నష్టపోతారని చెప్పొచ్చు…ఇప్పుడు వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..అలాగే టీడీపీ-జనసేన నుంచి వచ్చిన వారిని కౌంట్ చేసుకుంటే 156 మంది అవుతారు…అంటే 175లో 156 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్లే ఉన్నారు…ఇక ఈ 156 మందికి మళ్ళీ సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలోకి దిగితే వైసీపీకి నష్టం గట్టిగానే జరిగేలా ఉంది.

ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది..అలాంటివారికి కూడా నెక్స్ట్ సీట్లు ఇచ్చేస్తే వైసీపీ ఓటమి అంచులకు వెళుతుంది..కాబట్టి జగన్ ఖచ్చితంగా కొందరు ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇవ్వరని తెలుస్తోంది. కొందరిని ఈ సారి ఎన్నికలకు సైడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

ఇదే సమయంలో వ్యతిరేకత లేకపోయినా సరే కొందరిని సైడ్ చేసి బలమైన నాయకులకు సీట్లు ఇవ్వాల్సిన పరిస్తితి కూడా ఉంటుంది. అయితే ఇదంతా జగన్ ఎన్నికల ముందు చేసే ప్రక్రియ. కానీ ఇప్పుడే చాలా నియోజకవర్గాల్లో సీట్లు గురించి లొల్లి నడుస్తూనే ఉంది…సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా కొందరు నేతలు సీట్లు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉదాహరణకు కర్నూలు సిటీ ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు..ఆయనకు చెక్ పెట్టి సీటు దక్కించుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చూస్తున్నారు. ఇటు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు చెక్ పెట్టాలని పలువురు వైసీపీ నేతలు చూస్తున్నారు.ఇక చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ల మధ్య సీటు రగడ నడుస్తోంది. అటు పాయకరావుపేటలో మళ్ళీ గొల్ల బాబూరావుకు సీటు దక్కకూడదని చాలామంది ట్రై చేస్తున్నారు. రాజోలులో రాపాక వరప్రసాద్, బొంతు రాజేశ్వరరావుల మధ్య రచ్చ నడుస్తోంది. ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుల మధ్య సీటు పంచాయితీ ఉంది. ఇలా ఇంకా పలు చోట్ల వైసీపీ నేతల మధ్య సీట్ల లొల్లి నడుస్తోంది.

Discussion about this post