అధికార వైసీపీలో రోజురోజుకూ అసంతృప్త సెగలు ఎక్కువైపోతున్నాయి…ఇంతవరకు ఏ నేత కూడా బయటకొచ్చి ఓపెన్ గా తమ పార్టీలో ఉన్న విభేదాలు గురించి పెద్దగా మాట్లాడలేదు. ఎవరికి వారు జగన్ కు భయపడి బయటకొచ్చేవారు కాదు. మరి ఇప్పుడు అనూహ్యంగా సీన్ మారింది..ఊహించని విధంగా వైసీపీలో ఆధిపత్య పోరు పెరిగిపోయింది…ఆ నియోజకవర్గం…ఈ నియోజకవర్గం అనే తేడా లేదు…దాదాపు చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఫైట్ నడుస్తోంది. ఒక్కో జిల్లాలో కనీసం 5-6 స్థానాల్లో వైసీపీలో లుకలుకలు ఉన్నాయి.

ఇప్పటికే వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది..ఈ క్రమంలోనే పార్టీలో పెరుగుతున్న ఆధిపత్య పోరు కూడా పెద్ద మైనస్ అయ్యేలా ఉంది. ప్రతిరోజూ ఎవరోకరు మీడియా ముందుకొచ్చి తమ బాధని చెప్పుకుంటూనే ఉంటున్నారు…అలాగే ప్లీనరీ సమావేశాల వేదికగా వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. విచిత్రం ఏంటంటే సీనియర్ నాయకులే బయటకొచ్చి తమకు ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అందులోనూ రెడ్డి వర్గం నేతలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు.

అసలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వారే బయటకొచ్చి…తనపై సొంత పార్టీ నేత కుట్ర చేస్తున్నారని చెప్పారంటే..వైసీపీలో పరిస్తిటి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. బాలినేని చాలా సీనియర్ నాయకుడు…పైగా జగన్ రెడ్డికి బంధువు కూడా..ఆయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలినేని వెనుకే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకొచ్చి…తన పరిస్తిటి కూడా అంతే అంటున్నారు. సొంత పార్టీ వాళ్ళే తనపై కుట్ర చేస్తున్నారని, తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని అంటున్నారు.

దీనిపై జగన్ కు ఫిర్యాదు చేశానని, ఇది పరిష్కరిస్తే సరే అని లేదంటే..వేరే ఎమ్మెల్యేల నియోజకవర్గంలో తాను జోక్యం చేసుకుంటానని, లేదంటే పార్టీని వీడాల్సి కూడా వస్తుందని చెబుతున్నారు. అంటే వైసీపీలో రెడ్డి నేతలకే ఈ పరిస్తితి ఉంటే…మిగిలిన వాళ్ళ పరిస్తితి ఎలా ఉందో చెప్పాలసిన పనిలేదు. మొత్తానికి సొంత పోరే వైసీపీని ముంచేలా ఉంది.

Discussion about this post