అవును ఫ్యాన్ పార్టీ నేతలకు సైకిల్ సీటు ఇవ్వబోతున్నారంటా…నెక్స్ట్ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో రెండు, మూడు సీట్లని వైసీపీ నుంచి వచ్చే నాయకులకు ఇస్తారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మామూలుగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి పెద్ద బలం లేని విషయం తెలిసిందే..పూర్తిగా ఇక్కడ వైసీపీ డామినేషన్ ఉంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక నెల్లూరుకు పెద్దగా ఒరిగింది ఏమి లేదు…పైగా ఎమ్మెల్యేలు ప్రజల కోసం నిలబడి పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు..దీంతో నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

సరే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది కదా…అది టీడీపీకి ఏమన్నా అడ్వాంటేజ్ అవుతుందా? అంటే లేదనే చెప్పాలి..అసలు కొందరు టీడీపీ నేతలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నెల్లూరులో పార్టీ పరిస్తితి మెరుగు అవ్వలేదు. ఈ క్రమంలోనే నెల్లూరులో కొందరు టీడీపీ నేతలని సైడ్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారని సమాచారం…నెక్స్ట్ ఎన్నికల్లో వారికి మళ్ళీ సీట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది.

ఇదే క్రమంలో వైసీపీ నుంచి వచ్చే వారికి సీటు ఇవ్వడానికి బాబు రెడీ అవుతున్నారట. ఇప్పటికే వైసీపీకి కాస్త వ్యతిరేకంగా పరిస్తితులు మారుతున్నాయి..ఈ క్రమంలో కొందరు నేతలు టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారట. ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అలాగే కొందరు వైసీపీ నేతలు సైతం టీడీపీలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. అలాగే వారిలో బలమైన నేతలకు సీట్లు ఇవ్వాలని బాబు భావిస్తున్నారట. అంటే వచ్చే ఎన్నికల్లో కనీసం రెండు, మూడు సీట్లు అయిన వైసీపీ నుంచి వచ్చేవారికి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఈలోపు టీడీపీ నేతలు ఏమన్నా దూకుడుగా పనిచేయడం మొదలుపెడితే అప్పుడు బాబు ఆలోచన మారే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మరి చూడాలి ఈ సారి నెల్లూరు టీడీపీలో కొత్త క్యాండిడేట్లు ఎవరు వస్తారో..?

Discussion about this post