అసలే ప్రభుత్వంపై వ్యతిరేకత ఓ వైపు…ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత మరో వైపు..ఇలాంటి పరిస్తితుల్లో అధికార వైసీపీకి నష్టం గట్టిగా జరుగుతుంది. పైగా ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి వైసీపీకి మరింత ఇబ్బందిగా మారాయి..ఇలా వరుసగా వైసీపీకి నెగిటివ్ అవుతుంది. దీనికి తోడు వైసీపీలో జరిగే నేతల మధ్య పోరు మరింత డ్యామేజ్ చేస్తుంది.
ఇప్పటికే రాష్ట్రంలో చాలా స్థానాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది. సీట్ల కోసం, ఆధిపత్యం కోసం నేతల మధ్య రాజకీయ యుద్ధమే నడుస్తోంది. దీని వల్ల వైసీపీకి రిస్క్ పెరుగుతుంది. తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావుపేట, అనకాపల్లి స్థానాల్లో వైసీపీలో పోరు బయటపడింది. మొదట నుంచి ఆ రెండు స్థానాల్లో రచ్చ ఉంది. పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై ప్రజా వ్యతిరేకత మాత్రమే కాదు..సొంత పార్టీ నేతలు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు నెక్స్ట్ సీటు ఇస్తే తామే ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా బాబూ జగజ్జీవన్ రామ్ జయంతిలో కూడా రెండు వర్గాల మధ్య పోరు నడిచింది.

ఇటు అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు పడని పరిస్తితి. ముందు నుంచి వీరి మధ్య పోరు ఉంది. తాజాగా జగజ్జీవన్ రామ్ జయంతిలో ప్రసంగిస్తుండగా, పక్కనే ఉన్న దాడి డిగ్రీ కాలేజీలోని ఓ విద్యార్ధి జై జనసేన అనడం, పోలీసులు, వైసీపీ నాయకులు కాలేజీకి వెళ్ళి విద్యార్ధులపై చేయి చేసుకోవడంతో పరిస్తితి తీవ్రంగా మారింది.
దీనిపై దాడి సీరియస్ అయ్యారు..తాము వైసీపీలోనే ఉన్నామని, అయినా తమ విద్యార్ధులపై దాడి ఏంటని ఫైర్ అయ్యారు. ఇలా విశాఖ వైసీపీలో రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ వల్ల చివరికి వైసీపీకే నష్టం జరిగేలా ఉంది.