నారా లోకేష్ పాదయాత్ర ద్వారా అన్నీ వర్గాల ప్రజలని కలుసుకుంటూ వారి సమస్యలని తెలుసుకుంటూ..అధికారంలోకి రాగానే అండగా ఉంటామని చెబుతున్నారు. అలాగే టిడిపికి మైలేజ్ పెరిగేలా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. అదే సమయంలో లోకేష్ ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు.
ఇదే సమయంలో రాయలసీమలో చివరిగా పాదయాత్ర చేసిన కడప జిల్లాలోని బద్వేలు నేతలకు లోకేష్ ఇంటర్నల్ గా ఫుల్ క్లాస్ ఇచ్చారని తెలిసింది. అక్కడ నేతలు ప్రజల్లో ఉండకుండా..పార్టీ ఆఫీసుల్లో ఉండటం, లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం, విదేశాలకు వెళ్ళడం చేస్తున్నారట. దీంతో లోకేష్‌కు చిర్రెత్తుకొచ్చి..నేతలకు గట్టి క్లాస్ ఇచ్చారట. పాదయాత్ర బ్రేక్ సమయంలో కొందరు నేతలు లోకేష్‌కు సన్మానం చేయాలని చూస్తే..అది వద్దని..బద్వేలుని గెలిపిస్తే తానే సన్మానం చేస్తానని నేతలకు లోకేష్ చెప్పారట.

అలాగే ఇద్దరు, ముగ్గురు నేతల పాస్‌పోర్టులు తనకు ఇచ్చేయాలని, విదేశాల్లో తిరగకుండా ప్రజల్లో తిరగాలని సూచించారట. బద్వేలులో గెలిస్తేనే పార్టీ ఆఫీసుకు వచ్చి గట్టిగా మాట్లాడే అవకాశం ఉందని అన్నారట. అయితే బద్వేలులో టిడిపి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయింది. 1985లో ఒకసారి మళ్ళీ 1994, 1999, 2001 ఉపఎన్నికల్లోనే అక్కడ టిడిపి గెలిచారు. అక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడు గెలవలేదు.
2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. వైసీపీ గెలిచిన బద్వేలుకు చేసిందేమి లేదు..పైగా అక్కడ వైసీపీకి యాంటీ ఉంది. లోకేష్ పాదయాత్రతో టిడిపిలో జోష్ వచ్చింది. ఆ జోష్‌ని టిడిపి నేతలు కంటిన్యూ చేసి ప్రజా మద్ధతు పెంచుకుంటేనే బద్వేలులో గెలవగలరు..లేదంటే అంతే సంగతులు.