తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదిగి..అదే పార్టీకి చెక్ పెడుతూ వస్తున్న కొడాలి నాని..ఈ సారి ఎన్నికల్లో కూడా గెలుపు తనదే అనే ధీమాలో ఉన్నారు. గుడివాడలో ఐదో విజయం సాధిస్తానని అంటున్నారు. అయితే ఇలా ఐదోసారి కూడా విజయం తనదే అని చెప్పడం అనేది కాన్ఫిడెన్స్ గా కనిపించడం లేదు. పూర్తిగా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉంది..ఎందుకంటే ఇప్పటివరకు గుడివాడలో నాలుగుసార్లు గెలిచారు.
2004, 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచారు. అప్పుడు రాజకీయంగా కొన్ని వర్గాలపై పట్టు సాధించి..వైసీపీలోకి వెళ్ళి 2014, 2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. ఇలా నాలుగుసార్లు గెలిచారు. కానీ ప్రతిసారి కొడాలి ఓ సానుభూతిపై గెలుస్తూ వస్తున్నారు. 2004, 2009లో టిడిపి నుంచి గెలిచిన సరే కొడాలి అధికారంలో లేరు. దీని వల్ల గుడివాడలో పెద్దగా పనులు ఏమి చేయలేకపోయారు. 2014లో వైసీపీ నుంచి గెలిచారు. కానీ అప్పుడు వైసీపీ అధికారంలోకి రాలేదు. దీంతో గుడివాడ ప్రజలు అధికారంలో ఉండటం లేదు కదా..అందుకే పనులు చేయలేకపోతున్నారని అనుకుంటూ..కొడాలికి సపోర్ట్ చేస్తూ వచ్చారు.

కానీ 2019లో కొడాలి గెలిచారు..అటు వైసీపీ అధికారంలోకి వచ్చింది..మంత్రి పదవి దక్కింది..అయినా సరే గుడివాడకు చేసిందేమి లేదు. అభివృద్ధి పెద్దగా లేదు. కృష్ణా జిల్లాలో గుడివాడ రూరల్ ప్రాంతంలో ఉన్నట్లు దారుణమైన రోడ్లు ఎక్కడ లేవు..అటు గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో ఉన్న గ్రామాల్లో సైతం రోడ్లు దారుణంగా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో తాగునీటి వసతులు లేవు.
ఇక గుడివాడలో టౌన్ లో అంతే సంగతులు..ఇప్పుడు గుడివాడ కొత్త బస్టాండ్‌కు శంఖుస్థాపన పేరుతో హడావిడి చేస్తున్నారు. అలా చేస్తూ..ఐదోసారి గెలుస్తానని కొడాలి అంటున్నారు. కానీ ఈ సారి అలాంటి పరిస్తితి కనిపించడంలేదు. ఈ సారి కొడాలి గట్టి పోటీ ఎదుర్కోవాల్సిందే..టిడిపి ఇంకా బలపడితే కొడాలి గెలవడం కష్టమే.