పేదలకు-పెత్తందార్లకు మధ్య యుద్ధం..పేదల వైపు జగన్..పెత్తందార్ల వైపు చంద్రబాబు..ఆయనకు మద్ధతుగా పవన్..వీరంతా కలిసి పేదలని కాపాడుతున్న జగన్ పై రాళ్ళ దాడి చేయడం..ఇది వైసీపీ క్రియేట్ చేసిన రాజకీయం. గత కొన్ని రోజులుగా ఏ సభలో చూసిన జగన్ చెప్పేది ఇదే..పేదలకు,పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందని అంటున్నారు. పేదలకు అండగా ఉంటున్న తనపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, పేదలకు మేలు జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు.
విమర్శలు మాత్రమే దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా తయారు చేసి..ప్రతి నియోజకవర్గంలో పెడుతున్నారు. ఇదంతా పీకే టీం స్ట్రాటజీ అయి ఉంటుంది అందుకే..ఓ ప్లాన్ ప్రకారం ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇక ఆ ఫ్లెక్సీలు చూసి జనం..జగన్ పేదల వైపు పోరాడుతున్నారని అనుకోవాలని భావిస్తున్నారు. మరి ఆ పరిస్తితి ఉంటుందా..నిజంగానే జగన్ పేదల మనిషి అని ప్రజలు అనుకుంటున్నారా? అంటే వైసీపీ శ్రేణులు తప్ప..మిగతా వారు ఎవరు కూడా జగన్ పేదల మనిషి అనుకోవడం లేదు.

ఇక వైసీపీ ఫ్లెక్సీలకు టిడిపి, జనసేన కౌంటరుగా ఫ్లెక్సీలు కడుతున్నాయి. జగనాసుర రక్తచరిత్ర అని ఫ్లెక్సీలు వేస్తున్నారు. పదితలలతో జగన్ ఫోటో పెడుతున్నారు. అయితే పోలీసులు టిడిపి, జనసేన కట్టే ఫ్లెక్సీలని తొలగిస్తున్నారు గాని..వైసీపీ ఫ్లెక్సీల జోలికి వెళ్ళడం లేదు. ఈ అంశం కూడా జనంలోకి వెళుతుంది. ఇదంతా వైసీపీ కావాలని చేయిస్తుందని అర్ధమవుతుంది.
పేదల మనిషి అని చెప్పుకుంటూ..అదే పేదలపై పన్నుల భారం పెంచి ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారని, పేదలు ఇంకా పేదలుగానే ఉండేలా చేస్తున్నారని, పైగా ఇలా ప్రచారం చేసుకుంటున్నారని ప్రజలు ఆగ్రహంతో ఉన్న పరిస్తితి కాబట్టి. పేదల మనిషి అని జగన్ చెప్పుకుంటే సరిపోదు..ప్రజలు అనుకోవాలి. వైసీపీ వాళ్ళు తప్ప..మిగిలిన ప్రజలు జగన్ పేదల మనిషి అనుకోవడంలేదు. కాబట్టి వైసీపీ ఎత్తులు వర్కౌట్ కావు.