సాధారణంగా మంత్రులుగా పనిచేసేవారు..మళ్ళీ ఎన్నికల్లో గెలవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఏదో కొంతమందే గెలుపు గుర్రం ఎక్కుతారు తప్ప..మిగిలిన వారు గెలవడం కష్టమైపోతుంది. అంటే మంత్రులుగా చేస్తూ సొంత నియోజకవర్గాలని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్తితి వస్తుందని చెప్పవచ్చు. మంత్రులు అందుకే ఎక్కువ వ్యతిరేకత ఎదురుకుంటారు.
ఇప్పుడు ఏపీలో మంత్రుల పరిస్తితి కూడా అంతే..మొత్తం 25 మంత్రులు ఉంటే అందులో సగానికి పైగా మంత్రులు గెలవరని సర్వేలు చెబుతున్నాయి. ఇంకా ట్విస్ట్ ఏంటంటే మహిళా మంత్రి ఒక్కరూ కూడా మళ్ళీ గెలవరని తాజా సర్వే తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఏపీలో నలుగురు మహిళా మంత్రులు ఉన్నారు. తానేటి వనిత, రోజా, ఉషశ్రీ చరణ్, విడదల రజిని..ఈ నలుగురు జగన్ క్యాబినెట్ లో ఉన్నారు. ఆశ్చర్యకరంగా నలుగురు మంత్రులు ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. పైగా మంత్రులుగా పెద్దగా చేసేదేమీ లేదు. అటు ఎమ్మెల్యేలుగా తమ స్థానాల్లో చేసే పనులు తక్కువగా ఉన్నాయి.

దీంతో ఈ మహిళా మంత్రులు వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. తాజా సర్వేలో నలుగురు ఓడిపోతారని తేలింది. రెండుసార్లు నగరి నుంచి గెలిచిన రోజా..ఈ సారి గెలవడం కష్టమే అని తేలింది. అటు కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోమ్ మంత్రి వనిత సైతం..ఈ సారి గెలవడం కష్టమే అని తేలిపోయింది.
ఇక తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా అవకాశం కొట్టేసిన విడదల రజిని..చిలకలూరిపేటలో గెలవడం జరిగే పని కాదని తెలిసింది. అటు కళ్యాణదుర్గంలో ఉషశ్రీ చరణ్ పరిస్తితి కూడా అంతే అని తేలింది. అంటే మహిళా మంత్రులు ఒక్కరూ కూడా గెలిచేలా లేరు.
