బటన్ నొక్కి ప్రజల అందరికీ పథకాల పేరిట డబ్బులు పంచడం జగన్ పని అయితే..ఆ పథకాల వస్తున్నాయని ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించడం ఎమ్మెల్యేల పని. వీరికి తోడుగా వాలంటీర్లు ఉన్నారు. అలాగే ఇప్పుడు గృహ సారథులని… 50 ఇళ్లకు ముగ్గురుని నియమిస్తున్నారు. వీరంతా ఇంటింటికి వెళ్ళి.జగన్ ప్రభుత్వం చేసేది ప్రజలకు చెప్పి.. వారి ఓట్లు వైసీపీకి పడేలా చేయడం. ఇది కాన్సెప్ట్..దీంతో 175 సీట్లు గెలవాలని జగన్ భావిస్తున్నారు.

అందుకే ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళుతున్నారా? లేదా? అని చెప్పి ప్రతిసారి వర్క్ షాప్ పెట్టి సర్వే వివరాలని వారికి తెలియజేస్తున్నారు. సరిగ్గా తిరగని వారికి క్లాస్ ఇస్తున్నారు. తాజా వర్క్ షాప్‌లో కూడా అదే జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారు. గడపగడపకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అయితే కేవలం గడపగడపకు వెళ్ళి, బటన్ నొక్కితే 175 సీట్లు వచ్చేస్తాయా? అంటే ఆ విషయం గడపగడపకు వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేలని అడిగితే బెటర్ అని చెప్పవచ్చు.

ఎందుకంటే కేవలం పథకాల పేరిట డబ్బులు ఇస్తే సరిపోదు..ప్రజలపై పన్నుల భారం తగ్గించాలి..అభివృద్ధి చేయాలి.రోడ్లు వేయాలి..నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఏదో పథకాలు ఇస్తే ప్రజలు సంతృప్తి పడతారు అనుకుంటే కష్టమే. గత టీడీపీ హయాంలో కూడా పథకాలు వచ్చాయి. ఇప్పుడు రెండు, మూడు కొత్త పథకాలు ఉన్నాయి. అంతే తేడా…పథకాల విషయంలో పెద్ద మార్పు లేదు. ఇక అభివృద్ధి విషయం చెప్పాల్సిన పని లేదు.

ఇక ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళి పథకాలు వివరించడం కాదు..ప్రజల సమస్యలు పరిష్కరించాలి. అలాగే ఎమ్మెల్యేలదే మొత్తం భారమని, తాను బటన్ మాత్రం నొక్కుతానని జగన్ అంటున్నారు..కానీ సీఎం పాలనపై నెగిటివ్ ఉంటే..ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఎమ్మెల్యేలే కాదు..సీఎం కూడా ప్రజల్లో ఉండాలి. కాబట్టి గడపగడపకు ఎమ్మెల్యేలని పంపించి..బటన్ నొక్కితే గెలవడం కష్టం.

Leave feedback about this