గత ఎన్నికల్లో జగన్ గాలిలో టిడిపిలో బడా బడా నేతలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. పెద్దగా ఓటమి ఎరగని నేతలు సైతం ఓటమి రుచి చూశారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు..ఇప్పుడు అదే వైసీపీని ఓడించి రివెంజ్ తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు..వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అసలు అశోక్..విజయనగరం రాజకీయాల్లో తిరుగులేని నేత.

1978 నుంచి 2019 వరకు ఆయన రాజకీయ జీవితం చూసుకుంటే కేవలం 2 సార్లు మాత్రమే ఓడిపోయారు. 2004లో ఒకసారి, మళ్ళీ 2019 ఎన్నికల్లో ఒకసారి ఆయన ఓడిపోయారు. 2004లో విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా, 2019 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో విజయనగరం ఎమ్మెల్యేగా అశోక్ కుమార్తె అతిథి ఓటమి పాలయ్యారు. ఇలా తండ్రికూతురు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.
కానీ ఈ సారి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా వారు ముందుకెళుతున్నారుయ్. ఎలాగో విజయనగరం అసెంబ్లీ అంటే గజపతి ఫ్యామిలీ అడ్డా..అక్కడ మంచి విజయాలు సాధించింది. అయితే గత ఎన్నికల్లో ఓటమి గజపతి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టింది. కానీ ఇప్పుడు అక్కడ టిడిపి పుంజుకుంది. టిడిపి ఇంచార్జ్ గా అతిథి దూసుకెళుతున్నారు. పార్టీ బలం పెంచారు. అక్కడ వైసీపీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది.
