రాజకీయాల్లో యాక్టివ్‌గా లేనప్పుడే ఎంపీ గల్లా జయదేవ్‌పై డౌట్లు వస్తున్నాయి. ఆయన కూడా పార్టీ మారిపోతారా? అని టీడీపీ శ్రేణులకే అనుమానం కలుగుతుంది. ఇప్పటికే పలుమార్లు ఆయన పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. కానీ ఆయనకు పార్టీ మారే ఉద్దేశం ఉందా? అసలు టీడీపీ నుంచి కాకుండా నెక్స్ట్ వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా? అనే అంశాలని ఒక్కసారి చూస్తే…గుంటూరు నుంచి రెండోసారి ఎంపీగా గెలిచాక గల్లా..టీడీపీలో అనుకున్న మేర యాక్టివ్‌గా లేరు.

ఏదో అప్పుడప్పుడు మాత్రమే పార్టీలో కనిపిస్తూ వస్తున్నారు. ఇక మొదట్లో అమరావతి ఉద్యమానికి మద్ధతు తెలిపిన గల్లా..ఇప్పుడు అమరావతి ఉద్యమంలోనే కనిపించడం లేదు. ఇటు ఇటీవల టీడీపీలో పలు ఘటనలు జరిగాయి…అయినా సరే ఆయన పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో గల్లా టీడీపీని వీడటానికి సిద్ధమైపోయారని చెప్పి మీడియాల్లో ప్రచారం జరిగిపోతుంది.అయితే గల్లా టీడీపీని వీడటం జరిగే పనేనా అంటే…కాదనే చెప్పాలి. ఆయన ఏదో ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారు గానీ, అలా అని పార్టీని వీడతారని కాదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఆ మధ్య గల్లా కుటుంబానికి చెందిన అమర్‌రాజా సంస్థలని ఇబ్బంది పెట్టే రీతిలో వైసీపీ రాజకీయం చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాతే గల్లా కాస్త సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అనవసరంగా రాజకీయాల జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటున్నారు.

అలా అని ఆయన టీడీపీకి దూరం జరగలేదు. మళ్ళీ ఎన్నికల్లో ఆయన టీడీపీ తరుపునే బరిలో దిగడం ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే గుంటూరులో మళ్ళీ టీడీపీకి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి రాజధాని ప్రభావం వల్ల వైసీపీకి ఏ మాత్రం ఛాన్స్ కనబడటం లేదు. అటు బీజేపీలో చేరిన పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే గల్లాకు టీడీపీనే ప్లస్ తప్ప…వేరే పార్టీలు కావు.
Discussion about this post