అధికార వైసీపీలో చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. ఈ పోరు వల్ల వైసీపీకి భారీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికే కొన్ని స్థానాల్లో పరిస్తితి దారుణంగా ఉంది. నేతలు వీధికెక్కి రచ్చకు దిగుతున్నారు. అదే సమయంలో కృష్ణా జిల్లాలోని గన్నవరంలో కూడా పెద్ద పంచాయితీ నడుస్తోంది. ఇక్కడ వైసీపీలో గ్రూపులు ఉన్నాయి. ఎప్పుడైతే టీడీపీలో గెలిచి వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చారో, అప్పటినుంచి అక్కడ పోరు మొదలైంది.

వంశీపై ఓడిపోయిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు, మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావులు అసంతృప్తితో ఉన్నారు. పైగా వచ్చే ఎన్నికలో సీటు వంశీకే అని చెబుతున్నారు. దీంతో ఆ ఇద్దరు నేతలు రగిలిపోతున్నారు. వంశీకి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వంశీకి సహకరించే పరిస్తితి లేదని తేల్చి చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా దుట్టా-యార్లగడ్డ సంభాషణ సోషల్ మీడియాలో లీక్ అయింది. వారిద్దరు..కొడాలి నాని, వంశీలని తిడుతున్న వీడియో ఒకటి బయటకొచ్చింది.


యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. “ఆ కొడాలి నానీ ఏడో తరగతి తప్పిన వెధవ. ఆడు ఎంతసేపూ సినిమాలంటాడు. ఏ సినిమాలోనైనా ఏం ఉంటుంది. సినిమా మొత్తం హీరో కంటే విలన్‌కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. చివరికి క్లయిమాక్స్‌లో హీరో చేతిలో చెంపదెబ్బ తినడం కామన్. వాడి వల్ల నియోజకవర్గానికి ఏం ఉపయోగం? అసలు వంశీ, నానీ ఏ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించారు?” అని ఫైర్ అయ్యారు.


ఇక దుట్టా మాట్లాడుతూ… వంశీ ఆగడాలను తాము ప్రశ్నించబట్టే తమకు ప్రజల్లో గుర్తింపు వచ్చిందని అన్నారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతలు వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీకి ఏ మాత్రం సహకరించేలా లేరు.గన్నవరం పంచాయితీ..దుట్టా-యార్లగడ్డ రివర్స్ గేర్!
