May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

గంటా దూకుడు..వైసీపీకి ఆ నేతల షాకులు తప్పవా?

ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు గంటా శ్రీనివాసరావు వైసీపీ టార్గెట్ గా విమర్శలు చేయడం చూశాం..మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన విమర్శలు చేయడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన సరే అధికారంలో లేకపోవడంతో గంటా యాక్టివ్ గా లేరు. అసలు పార్టీలో కనిపించలేదు. పార్టీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా..నేతలు కష్టాల్లో ఉన్నా సరే గంటా బయటకు రాలేదు.

తాను ఎక్కడ బయటకొస్తే తనకు ఇబ్బంది అని ఆలోచించి ఉంటారు..అందుకే ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. ఇక మధ్యలో పార్టీ మారిపోతారని ప్రచారం కూడా వచ్చింది. కానీ పార్టీ మారలేదు. టి‌డి‌పిలో ఉన్నారు..కాకపోతే యాక్టివ్ గా పనిచేయలేదు. కానీ గత కొన్ని రోజుల నుంచి గంటా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడైతే పవన్ పొత్తు గురించి సానుకూలంగా మాట్లాడారో..లోకేశ్ పాదయాత్ర మొదలైందో..అప్పటినుంచి టి‌డి‌పిలో యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు, లోకేశ్ లని కలిసి మళ్ళీ పార్టీలో దూకుడుగా పనిచేస్తున్నారు.

ఇక ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేశారు. టి‌డి‌పికి ఉన్న బలం, నేతల కష్టం..అభ్యర్ధి ఇమేజ్ వల్ల ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు టి‌డి‌పి గెలిచింది. అటు మరో రెండు ఎమ్మెల్సీలు కూడా టి‌డి‌పి గెలిచింది. ఈ విజయాలతో గంటా టి‌డి‌పిలో దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. వైసీపీపై విమర్శల దాడి చేస్తున్నారు. వరుసపెట్టి విరుచుకుపడుతున్నారు.

తాజాగా అసెంబ్లీలో టి‌డి‌పి ఎమ్మెల్యేలపై దాడిపై గంటా సీరియస్ అయ్యారు..ఓటమి భయంతోనే వైసీపీ ఇదంతా చేస్తుందని ఫైర్ అయ్యారు. మొత్తానికి గంటా టి‌డి‌పిలో దూకుడుగా ఉంటున్నారు. ఇక గంటా టి‌డి‌పిలో ఫిక్స్ కావడంతో..వైసీపీలోకి వెళ్ళిన ఆయన సన్నిహితులు తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పంచకర్ల రమేశ్, కాశీ విశ్వనాథం,రహమాన్, ఆడారి ఆనంద్, అవంతి శ్రీనివాస్ లాంటి వారు వైసీపీకి షాక్ ఇచ్చి టి‌డి‌పిలోకి వస్తారని ప్రచారం వస్తుంది. చూడాలి మరి ఎవరు టి‌డి‌పిలోకి వస్తారో.