గంటా శ్రీనివాసరావు…ఎప్పుడు ఎలా రాజకీయం చేస్తారో…ఏ పార్టీలోకి వెళ్తారో…ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో క్లారిటీ లేని నాయకుడు. కానీ ఎన్ని పార్టీలు మార్చిన, ఎన్ని నియోజకవర్గాలు మార్చిన ఈయన ఇంతవరకు ఓడిపోలేదు. పైగా ఈయనకు విశాఖపట్నంలో ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే గంటా చుట్టూనే విశాఖ రాజకీయాలు ఎక్కువ తిరుగుతాయి. అసలు ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోయినా సరే, ఆయనపై అనేక కథనాలు వస్తాయి.

కానీ ఎన్ని కథనాలు వచ్చినా సరే గంటా రాజకీయం ఏంటో ఇప్పటికీ ఎవరికి అర్ధం కాదు. అసలు ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారో..బయటకు వెళ్లిపోతారో..అసలు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆయన టీడీపీ ఎమ్మెల్యే…కానీ టీడీపీలో యాక్టివ్ గా లేరు. మధ్యలో వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. కానీ పార్టీ మారలేదు.

అంటే ఆయన రాజకీయం పూర్తిగా కన్ఫ్యూజన్‌గా ఉందని చెప్పొచ్చు. మళ్ళీ ఈ మధ్య ఏంటో టీడీపీలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో పోస్టుల్లో చంద్రబాబు ఫోటో కూడా పెట్టుకుంటున్నారు. అంటే టీడీపీలోనే ఉన్నానని చెబుతున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే టీడీపీ నాయకులకు గానీ, క్యాడర్‌కు గానీ గంటాపై నమ్మకం లేదు. ఆయన ఎప్పుడైనా పార్టీ మారిపోతారని చెప్పి, ఆయన్ని టీడీపీ క్యాడర్ లైట్ తీసుకుంది.

అసలు వచ్చే ఎన్నికల్లో పరిస్తితిని బట్టి గంటా రాజకీయం చేసేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి టీడీపీలోనే ఉన్నట్లు కనిపిస్తున్న గంటా…ఎన్నికల ముందు ఉండే రాజకీయ వాతావరణం బట్టి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంటే టీడీపీకి అనుకూలంగా పరిస్తితి ఉంటే..టీడీపీలోనే కొనసాగుతారు. లేదంటే పార్టీ మారిపోతారు. అదే సమయంలో ఆయన ఈ సారి నియోజకవర్గాన్ని కూడా మార్చడం గ్యారెంటీ అని తెలుస్తోంది. విశాఖ నార్త్‌లో ఇప్పుడు గంటాకు పూర్తిగా వ్యతిరేకత ఉంది. కాబట్టి మళ్ళీ అక్కడే నిలబడితే గెలవడం కష్టం….అందుకే నెక్స్ట్ ఎన్నికల్లో వేరే నియోజకవర్గంలో పోటీ చేయడం ఖాయం.

Discussion about this post