రాజకీయంగా బలమైన నాయకుల్లో గంటా శ్రీనివాసరావు కూడా ఒకరనే సంగతి తెలిసిందే…ఆయన యాక్టివ్‌గా ఉన్నా, లేకపోయినా సరే…రాజకీయంగా మాత్రం ఆయనకున్న ఇమేజ్ మాత్రం తగ్గదు. ఉత్తరాంధ్రలో ఈయన బలం ఏంటో అందరికీ తెలుసు. అందుకే గంటా లాంటి నాయకులు యాక్టివ్‌గా లేకపోయినా సరే, వేరే పార్టీలోకి వెళ్లిపోతారని కథనాలు వచ్చినా సరే…టీడీపీ మాత్రం వదలడం లేదు. ఇలా కొన్ని పరిస్తితులు వచ్చిన సరే…మళ్ళీ గంటా పార్టీలో యాక్టివ్ అవ్వగానే, టీడీపీ శ్రేణులు ఓన్ చేసుకునే పరిస్తితి ఉంది.

ఎందుకంటే రాజకీయంగా గంటా బలమైన నాయకుడు కాబట్టే.. పైగా ఈయన ఎన్ని పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా కూడా…ఇంతవరకు ఓడిపోలేదు…అంటే గంటా కెపాసిటీ అలాంటిది అని చెప్పొచ్చు. అయితే గత ఎన్నికల్లో కూడా ఈయన టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గెలిచాక పూర్తిగా రాజకీయాల్లో కనిపించలేదు…టీడీపీ అధికారంలో ఉంటే దూకుడుగా ఉండేవారేమో…వైసీపీ అధికారంలోకి రావడంతో సైలెంట్ అయిపోయారు.

ఇక ఈయన ఎన్ని సార్లు పార్టీ మారిపోతారని ప్రచారం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. అదిగో ఈయన పార్టీ మారడం ఖాయమైపోయిందని, రేపో, మాపో వైసీపీలోకి వెళ్తారని టీడీపీ అనుకూల మీడియాలో సైతం కథనాలు వచ్చాయి…అంటే ఈయన వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేశారనే కథనాల్లో వాస్తవం ఉందని చెప్పొచ్చు. కాకపోతే వైసీపీలో ఉన్న అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి లాంటి వారు గంటా రాకని అడ్డుకున్నారని తెలిసింది.

ఎందుకంటే గంటా లాంటి వారు వస్తే విశాఖలో ఆయన పెత్తనమే ఎక్కువ ఉంటుంది…దీంతో విజయసాయికి, అవంతికి ఇబ్బంది అవుతుంది..అందుకే గంటాని రాకుండా అడ్డుకున్నారని తెలిసింది. అయితే వైసీపీలోకి వెళ్లకుండా సైలెంట్‌గా అలాగే ఉండిపోయినా గంటా…ఈ మధ్య మళ్ళీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు…మళ్ళీ విశాఖలో యాక్టివ్‌గా తిరగడం స్టార్ట్ చేశారు. ఇక ఈయన పార్టీ మారడానికి ప్రయత్నించినా సరే…మళ్ళీ టీడీపీ అధిష్టానం ఈయనని దగ్గరకు తీసుకుంది…ఎందుకంటే గంటా వల్ల రాజకీయంగా ప్లస్ అవుతుంది కాబట్టి.

Discussion about this post