ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ-జనసేనల లవ్ స్టోరీ అంశం బాగా హైలైట్ అవుతుంది. ఓ వైపు చంద్రబాబు…పవన్‌ని దగ్గర చేసుకోవాలని చూస్తున్నారు..కానీ పవన్ మాత్రం దగ్గర అవ్వడానికి ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. ఆ విషయం తాజాగా చంద్రబాబు చెప్పిన లవ్ స్టోరీలోనే అర్ధమైంది. వన్ సైడ్ లవ్ చేయడం వల్ల ఉపయోగం లేదని, అటు పక్క వాళ్ళు కూడా లవ్ చేయాలని చెప్పి మాట్లాడారు.

అంటే పవన్‌తో పొత్తు పెట్టుకోవడానికి బాబు రెడీగానే ఉన్నారు..కానీ పవన్ మాత్రం పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తిగా లేనట్లు కనిపిస్తోంది. దీని బట్టి చూస్తే పొత్తు అంశంలో ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు. అయితే టీడీపీతో పొత్తు లేకపోతేనే తమకు ఉనికి ఉంటుందని కొందరు జనసేన నేతలు మాట్లాడుతున్నారు. అదే సమయంలో జనసేనతో పొత్తు లేకుండానే గెలిచి చూపించాలని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.

ఒకవేళ జనసేన సపోర్ట్‌తో గెలిస్తే తమ సపోర్ట్‌తోనే గెలిచారని డప్పు కొట్టుకుంటారని, ఆ డప్పు తాము చూడలేమని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. అయితే రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోతే రెండు పార్టీలకు నష్టమే..అలాగే మధ్యలో వైసీపీకి బెనిఫిట్ అవుతుంది. గత ఎన్నికల మాదిరిగా. అయితే జనసేనతో పొత్తు లేకపోతే గోదావరి జిల్లాల టీడీపీ నేతలు మాత్రం భారీగా నష్టపోతారు. గత ఎన్నికల్లోనే వారు బాగా నష్టపోయారు. రెండు జిల్లాలో కలిపి మొత్తం 34 సీట్లు ఉన్నాయి.

అందులో టీడీపీకి 6 మాత్రం దక్కాయి. ఇక జనసేన వల్ల దాదాపు 15 సీట్లు వరకు కోల్పోయారని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో టీడీపీపై వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే…జనసేనకి పడిన ఓట్లు ఎక్కువ. అదే ఆ ఓట్లు టీడీపీకి కలిసి ఉంటే వైసీపీ గెలుపు సాధ్యమయ్యేది కాదు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు లేకపోతే గోదావరి తమ్ముళ్ళ పరిస్తితి మళ్ళీ అస్సామే.

Discussion about this post