ఏపీ రాజకీయాల్లో అరుదైన నేతగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం..అందరినీ కలిచివేసిన విషయం తెలిసిందే…పార్టీలకు అతీతంగా గౌతమ్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి వివాదాల్లో లేకుండా ఉన్న గౌతమ్..మంత్రిగా ఉందా అలాగే హుందాగా రాజకీయాలు చేసిన విషయం తెలిసిందే…అలాంటి నాయకుడు మరణం..ఏపీ రాజకీయాల్లో తీరని లోటుగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక మేకపాటి మరణంతో ఆయన నిర్వహించిన శాఖలని వేరే వారికి అప్పగించాల్సి ఉంటుంది.

ఆయన స్థానంలో మరొకరిని క్యాబినెట్‌లో తీసుకోవాలి..అయితే ప్రస్తుతానికి శాఖలని సీఎం తన వద్దే ఉంచుకుని..మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు జరిగేప్పుడు వేరే వారికి ఇస్తారా? లేక ఇప్పుడే వేరే ఎమ్మెల్యేని క్యాబినెట్‌లోకి తీసుకుని గౌతమ్ బాధ్యతలు అప్పగిస్తారా? అనేది చూడాలి. సరే ఎప్పుడైనా గాని గౌతమ్ శాఖలు వేరే వాళ్ళకు దక్కాల్సిందే. అలాంటప్పుడు గౌతమ్ రెడ్డి ప్లేస్‌లో ఎవరిని క్యాబినెట్‌లోకి తీసుకుంటారనేది చూడాల్సిన విషయం.

నెల్లూరు జిల్లాలో మాత్రం మంత్రివర్గంలో చోటు కోసం చాలామంది ఆశావాహులు ఎదురుచూతున్నారు…ప్రస్తుతానికి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ మంత్రివర్గంలో ఉన్నారు..నెక్స్ట్ ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పిస్తే…ఇద్దరు ఎమ్మెల్యేలని క్యాబినెట్‌లోకి తీసుకుంటారు. ఇప్పటికే పదవి కోసం కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వారు ట్రై చెస్తున్నారు. అయితే కాకానికి తప్పకుండా పదవి దక్కుతుందనే ప్రచారం ఉంది.




అంటే నెల్లూరులో గౌతమ్ ప్లేస్‌లో కాకానిని తీసుకునే ఛాన్స్ ఉంది..అదే సమయంలో గౌతమ్ నిర్వహించిన శాఖలు ఆయనకు కొన్ని దక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. కాకపోతే ఐటీ, పరిశ్రమల శాఖలు మాత్రం బాగా చదుకున్నవారికి…విదేశాలు వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించే సత్తా ఉన్నవారికే ఇస్తారు..అంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడుతూ…చదువుకున్న ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి చూడాలి చివరికి గౌతమ్ ప్లేస్‌లో ఎవరు మంత్రిగా వస్తారో.

Discussion about this post