తాజాగా ఏర్చి కూర్చిన కొత్త మంత్రివర్గంలో దివంగత మేకపాటి గౌతంరెడ్డి కుటుంబానికి లేదా.. మేకపాటి కుటుంబ సభ్యుల్లో ఒకరికి మంత్రి పదవిని అప్పగిస్తారని.. అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. హఠాన్మ రణం పొందిన మంత్రి కావడంతోసానుభూతి కోణంతోపాటు.. మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. ఆ కుటుంబా నికి పార్టీ, ప్రభుత్వం కూడాఅండగా ఉంటుందని అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా తాజాగా కూర్పులో మేకపాటి కుటుంబానికి ఎక్కడా అవకాశం దక్కలేదు. అంతేకాదు.. అసలు మంత్రి వర్గంలో ఎక్కడా మేకపాటి కుటుంబం ప్రస్తావన కూడా రాలేదు.
గత కేబినెట్‌లో మేకపాటి గౌతంరెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకున్న సమయంలోనే.. ఐదేళ్లు కొనసాగిస్తానని ఆయనకు హామీ ఇచ్చినట్టు వైసీపీలో ప్రచారం ఉంది. అయితే.. గత ఫిబ్రవరిలో గౌతం హఠాన్మరణం చెందా రు. ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ.తనకు ప్రాణసమానుడని.. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. దీంతో మేకపాటిస్థానంలో ఆయన సతీమణి శ్రీకీర్తికిమంత్రి పదవి ఖాయమని.. సీనియర్ నాయకు ల నుంచి మేకపాటి కుటుంబం వరకు అందరూ అనుకున్నారు. అదేసమయంలో అనేక విశ్లేషణలు కూడా వచ్చాయి.
అంటే.. ఉప ఎన్నికలకు ముందుగానే.. ఈ కుటుంబం నుంచి శ్రీకీర్తికి మంత్రి పదవి ఇచ్చి.. వచ్చే ఉప పోరులో ఆమెకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటారని .. అందరూ అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా మేకపాటి కుటుంబం గౌతం రెడ్డి స్థానంలో శ్రీకీర్తి కాకుండా.. గౌతంరెడ్డి సోదరుడు.. విక్రమ్‌ను తీసుకువ చ్చింది. ఈ మేరకు సీఎం జగన్‌కు కూడా సందేశం పంపింది. అంటే.. త్వరలోనే జరగనున్న.. ఉప పోరులో.. విక్రమ్ పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో విక్రమ్‌కు మంత్రి వర్గంలో అవకాశం ఇస్తారని.. భావించారు.
అయితే.. తుది జాబితాలో ఎక్కడా చోటు లభించలేదు. దీంతోగౌతం రెడ్డిని అప్పుడే మరిచిపోయారా? అనే అనుమానాలు.. ప్రశ్నలు.. తీవ్రస్థాయిలో నిండిపోయాయి. గౌతం రెడ్డి తనకు ప్రాణ సమానుడని చెప్పిన జగన్.. అప్పుడే మరిచిపోయారా? లేక . ఉద్దేశ పూర్వకంగానే పక్కన పెట్టారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. గౌతంరెడ్డి కుటుంబాననికి అవకాశం ఇవ్వకపోవడం.. మాత్రం నిరాశ కలిగిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
Discussion about this post