ఏపీ రాజకీయాల్లో ఇప్పుడుప్పుడే మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది…ఇంతవరకు అధికార వైసీపీదే హవా అన్నట్లు పరిస్తితి ఉంది…కానీ నిదానంగా వైసీపీ హావా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ కూడా స్లోగా స్ట్రాంగ్ అవుతుంది. గత ఎన్నికలతో పోలిస్తే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి మెరుగైంది. అయితే ఇంకా కొన్ని చోట్ల టీడీపీ పరిస్తితి మెరుగవ్వాలి. కొన్ని చోట్ల టీడీపీ నాయకులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పికప్ అవ్వలేకపోతుంది. మరి కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల టీడీపీకి ఛాన్స్ దొరకడం లేదు. అలాంటి టీడీపీకి ఛాన్స్ దొరకని వాటిల్లో పాణ్యం కూడా ఒకటి.

అసలు పాణ్యం అంటేనే టీడీపీకి ఏ మాత్రం కలిసిరాని నియోజకవర్గం…ఇక్కడ టీడీపీ గెలిచింది కేవలం రెండు సార్లు మాత్రమే. 1983, 1999 ఎన్నికల్లోనే పాణ్యంలో టీడీపీ గెలిచింది. మళ్ళీ ఇంతవరకు టీడీపీ గెలవలేదు. పైగా చాలా కాలం నుంచి టీడీపీకి బలమైన నాయకులు కూడా దొరకడం లేదు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీకి గౌరు చరితారెడ్డి రూపంలో బలమైన నాయకురాలు దొరికారు.

కానీ ఆమె కంటే బలమైన నాయకుడు వైసీపీలో ఉన్నారు. కాటసాని రామ్ భూపాల్ రెడ్డి చాలా బలమైన నాయకుడు. పాణ్యం నుంచి ఈయనే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు పాణ్యం నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. ఇక ఆయనని దాటి ఇక్కడ టీడీపీ గెలవడం అనేది అసాధ్యమైన పని.

కానీ టీడీపీని బలోపేతం చేయడానికి గౌరు చరితా గట్టిగానే ట్రై చేస్తున్నారు. పాణ్యంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది…అలాగే గౌరు ఫ్యామిలీకి సెపరేట్ బలం ఉంది. కానీ ఈ బలం కాటసానికి చెక్ పెట్టడానికి సరిపోవడం లేదు. ప్రస్తుతానికి కూడా పాణ్యంలో కాటసానిదే హవా. అయితే నెక్స్ట్ ఎన్నికల్లోపు కాటసాని బలం ఏమన్నా తగ్గితే చరితాకు ఛాన్స్ ఉంటుంది…లేదంటే మళ్ళీ గెలవడం కష్టమే.

Discussion about this post