40 ఏళ్లకు పైగా హిస్టరీ ఉన్న తెలుగు దేశం పార్టీలో నాయకులకు అవకాశం దక్కడం.. అంటే.. మాటలు కా దు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా.. దాదాపు ఒక్కొక్క సీటుకు.. ఇద్దరి నుంచి ముగ్గురు వరకు నాయకు లు పోటీ పడుతుంటారు. దీంతో టికెట్లు దక్కించుకోవడమే.. పెద్ద యుద్ధం గెలిచినట్టుగా నాయకులు భావి స్తారు. గెలుపు ఓటములతో సంబందం లేకుండా.. నాయకులు టికెట్లు దక్కించుకునేందుకే చెమటలు పట్టినంత పనిచేయాల్సి ఉంటుంది.

దటీజ్ టీడీపీ! అనే మాట అందుకే వచ్చింది. ఇక, సీనియర్లు.. ఒకటి రెండు దశాబ్దాలుగా పార్టీలో పనిచే స్తున్నవారు… సామాజిక వర్గాల వారీగా.. ప్రభావం చూపించే నేతలకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. కొత్తగా రాజ కీయాల్లోకి వచ్చిన వారు.. అప్పుడే.. మొగ్గతొడిగిన వారి పరిస్థితి ఏంటి? అనేది ఎప్పుడు చర్చగానే ఉంటుం ది. అయితే.. ఈ సారి అలాంటి పరిస్థితి లేకుండా.. పార్టీ అధినేత చంద్రబాబే .. స్వయంగా తాను 40 శాతం సీట్లను అంటే.. 50కిపైగా.. స్థానాలను యువతకు ఇచ్చేస్తానని ప్రకటించారు.సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ.. పైగా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని.. ఓ వర్గం ప్రజలు, నాయకులు గట్టిగా నమ్ముతున్న పార్టీలో ఇంత పెద్ద సంచలన ప్రకటనను ఆషామాషీగా తీసేయాల్సిన అవసరం లేదు. పైగా.. చంద్రబాబు కూడా గతంలో ఒకటి రెండు సార్లు ఇలా చెప్పి.. కూడా సీనియర్లకు అవకాశం ఇచ్చినా.. ఇప్పుడు ఆయన అలా చేసే అవకాశం లేదు. ఎందుకంటే… ఆయన కుమారుడిని వచ్చే ఎన్నికల్లోనే బాగా ప్రొజెక్టు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సో.. లోకేష్‌బాబుకు ఖచ్చితంగా యూత్ మద్దతు అవసరం. కాబట్టి.. ఎలా చూసుకున్నా.. ఈ 40 శాతం హామీని ఖచ్చితంగా అమలు చేసేందుకు చంద్రబాబు కట్టుబడే ఉంటారు. మరి ఇప్పుడు కావాల్సింది ఏంటి? అంటే.. యువత పుంజుకోవడం.. వచ్చే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కనుక.. తాము పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం.. గెలుపు గుర్రాలు ఎక్కుతామనే.. ధీమాను అధినేత చంద్రబాబుకు కల్పించడం.. వారి ముందున్న కర్తవ్యాలు. సో.. ఎంతో హిస్టరీ.. ఆత్మగౌరవం అనే నినాదాలు సొంత చేసుకున్న పార్టీలో అవకాశం దక్కించుకునేందుకు యువత ఇప్పటి నుంచే రెడీ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎవరు ఆ లక్కు దక్కించుకుంటారో చూడాలి.
Discussion about this post