ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేని స్థానాల్లో ప్రొద్దుటూరు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ టిడిపికి బలం కాస్త తక్కువే. కాకపోతే రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఉండటం..ఆ వర్గం వైసీపీ వైపు ఉండటంతో టిడిపికి కలిసిరావడం లేదు. ఎప్పుడో 1983, 1985 ఎన్నికల్లోనే అక్కడ టిడిపి గెలిచింది. మళ్ళీ 2009లో గెలిచింది. 2009లో కడపలో టిడిపి ఒక్క సీటు గెలవలేదు. కానీ ప్రొద్దుటూరులో గెలిచింది.
ఇక 2014లో ఓటమి పాలైంది..2019 ఎన్నికల్లో అదే పరిస్తితి. రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన పరిస్తితి సరిగా లేదు. పనితీరుపై ప్రజలు సంతృప్తిగా లేరు. అధికారంలో ఉన్న అభివృధ్ది చేసేది తక్కువే. పైగా సొంత పార్టీ నేతలతోనే విభేదాలు ఉన్నాయి. కొందరు రాచమల్లుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దీంతో ప్రొద్దుటూరులో వైసీపీకి మైనస్ ఉంది. అదే సమయంలో లోకేష్ పాదయాత్ర ప్రొద్దుటూరులో ఎంట్రీ ఇచ్చింది.

పాదయాత్రతో ప్రొద్దుటూరులో టిడిపికి కాస్త ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ టిడిపికి కాస్త మైనస్ ఉంది. నేతల మధ్య పోరు ఉండటం టిడిపికి పెద్ద మైనస్. ఇక్కడ సీనియర్ నేత మల్లెల లింగారెడ్డి..ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య పోరు నడుస్తుంది. ఇద్దరి మధ్య సీటు వార్ నడుస్తుంది. 2004 నుంచి లింగారెడ్డి పోటీ చేస్తూ వస్తున్నారు. 2009లో గెలిచారు. 2014లో సీటు దక్కలేదు. 2019లో పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత ప్రవీణ్ని ఇంచార్జ్ గా పెట్టారు. దీంతో సీటు తనదే అని ప్రవీణ్ అంటున్నారు. కాదు అధిష్టానం సీటు తనకే ఇస్తుందనే ధీమాతో లింగారెడ్డి ఉన్నారు. ఇలా ఇద్దరు నేతల మధ్య సీటు పంచాయితీ ఉంది. ఎవరికొకరికి సీటు ఇస్తారు..ఇద్దరు కలిసి పనిచేస్తే ప్రొద్దుటూరులో గెలుస్తారు..లేదంటే మళ్ళీ అంతే సంగతులు.