April 2, 2023
Uncategorized

గుడివాడతో పాటు గన్నవరంలో టీడీపీకి గెలుపు దూరమే.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసలు టి‌డి‌పి కంచుకోటలు అంటే ఒకప్పుడు గుడివాడ-గన్నవరం పేర్లు చెప్పే పరిస్తితి. కానీ ఇప్పుడు సీన్ అలా లేదు. రెండు చోట్ల టి‌డి‌పికి భారీ నష్టం జరిగింది. టి‌డి‌పిలో ఉంటూ బలపడి..వైసీపేలోకి జంప్ చేసిన నేతల వల్ల దెబ్బ పడింది. గుడివాడలో కొడాలి నాని రెండుసార్లు టి‌డి‌పి నుంచి గెలిచి వైసీపీలోకి జంప్ చేసి..రెండుసార్లు వైసీపీలో గెలిచారు.

కొడాలి అటు వెళ్ళడంతో గుడివాడలో టి‌డి‌పి సరిగ్గా లేదు. పైగా కొడాలి రాజకీయం వల్ల టి‌డి‌పికి డ్యామేజ్ జరిగింది. ఇప్పటికీ అక్కడ ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. అందుకే తన నియోజకవర్గానికి  చంద్రబాబు వచ్చి పోటీ చేసిన గెలుపు తనదే అనే ధీమాలో నాని ఉన్నారు. పైగా దీనికి తగ్గట్టుగా తాజాగా విడుదలైన సర్వేలో కూడా గుడివాడలో టి‌డి‌పి గెలవదని తేలింది. మళ్ళీ ఇక్కడ వైసీపీ గెలుస్తుందని సర్వేలో స్పష్టమైంది.అంటే గుడివాడలో కొడాలి హవా ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు. ఇక మొన్నటివరకు గుడివాడ పోయిందని అనుకుంటే…ఇప్పుడు గన్నవరం కూడా పోయేలా ఉంది. గన్నవరం కూడా మొన్నటివరకు టి‌డి‌పి  కంచుకోటే కానీ ఎప్పుడైతే వల్లభనేని వంశీ టి‌డి‌పి నుంచి గెలిచి వైసీపీలోకి జంప్ చేశారో..అప్పటినుంచి అక్కడ కూడా సీన్ మారిపోయింది. వంశీ వైసీపీ వైపుకు వెళ్ళాక..గన్నవరంలో టి‌డి‌పిని నడిపించే నాయకుడు లేడు. బచ్చుల అర్జునుడు సైతం ఇటీవల మరణించారు. దీంతో అక్కడ సరైన నాయకుడు లేరు.

ఈ క్రమంలో గన్నవరంలో కూడా టి‌డి‌పి గెలవదని సర్వేలో తేలింది. ఇక్కడ వైసీపీ గెలుస్తుందని తెలిసింది. అంటే గుడివాడ-గన్నవరంల్లో టి‌డి‌పి గెలవడం కష్టమని తేలిపోయింది. ఎన్నికల్లోపైన గట్టిగా ఫోకస్ చేసి బలమైన నాయకులని పెడితే ఏమైనా ఫలితం మారే ఛాన్స్ ఉంది.