ఏపీ రాజకీయాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సెటైర్లు పెళుతున్నాయి. ఆయన తెలిసి అంటారో..తెలియక అంటారో..తెలియదు గాని ఆయన ఏం మాట్లాడిన దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. పూర్తిగా ఆయనని కామెడీ తరహాలో ట్రోల్ చేస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్‌తో అమర్నాథ్ ఫోటోపై పెద్ద రచ్చ నడిచిన విషయం తెలిసిందే.

అయితే తనతోనే పవన్ ఫోటో దిగరని చెప్పి అమర్నాథ్ చెప్పిన మతలపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది.ఆ తర్వాత పెట్టుబడులని ఆకర్శించేందుకు దావోస్‌కు వెళ్లకుండా..దావోస్ లో చలి ఎక్కువని తమ ఆరోగ్యాలు ఏం అవుతాయని, అక్కడ సరిగ్గా స్నానం చేయడానికి కూడా ఉండదని మాట్లాడారు. కానీ పక్కనే ఉన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటిఆర్ మాత్రం దావోస్‌కు వెళ్లారు. ఇంకా దేశంలో పలువురు దావోస్‌కు వెళ్లారు. వారికి లేని చలి అమర్నాథ్‌కు మాత్రమే ఉందని విమర్శలు వచ్చాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా గుడివాడ చెప్పిన గుడ్డు కథపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. హైదరాబాద్‌లో కారు ఈ-రేసు నడుస్తున్న విషయం తెలిసిందే. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో ఏపీ ఐటీ మంత్రిగా ఉన్న అమర్నాథ్ కూడా వెళ్లారు. అప్పుడు ఏపీలో ఎప్పుడు ఇలాంటివి జరుగుతాయని అమర్నాథ్‌ని ప్రశ్నించారు. దానికి అమర్నాథ్ సమాధానం ఇస్తూ..కోడి డైరక్ట్ గా కోడిని పెట్టలేదని, మొదట గుడ్డు పెట్టి, ఆ తర్వాత పొదిగి పిల్లని చేసి..తర్వాత పెద్దది అవుతుందని చెప్పుకొచ్చారు.

దీంతో గుడివాడ గుడ్డు కథపై పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. రాష్ట్రానికి పరిశ్రమలు గాని తీసుకురాకుండా ఇలా గుడ్డు కథలు చెబుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఇలా ట్రోల్స్ రావడం వైసీపీకి మైనస్‌గా మరాయని చెప్పవచ్చు.
