తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడని కొడాలి నాని తన అడ్డాగా మార్చుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నుంచే రాజకీయంగా ఎదిగి రెండుసార్లు గెలిచి..వైసీపీలోకి వెళ్ళి రెండుసార్లు టీడీపీని ఓడించిన కొడాలి..గుడివాడలో తిరుగులేని బలం పెంచుకున్నారు. ఇక చంద్రబాబు వచ్చిన తనపై పోటీ చేసినా గెలవలేరని చెప్పి కొడాలి ధీమాగా ఉన్నారు. అయితే కొడాలి వరుసగా గుడివాడలో గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గుడివాడలో ఎక్కువగా ఉన్న ఎస్సీ ఓటర్లు. దాదాపు 50 వేల పైనే ఎస్సీ ఓటర్లు ఉన్నారు. వారు మెజారిటీ కొడాలికే మద్ధతు.

అటు బీసీ ఓటర్లు గతంలో టీడీపీ వైపు ఉండేవారు. ఇప్పుడు సగం సగం అయిపోయారు. కాపులు కూడా మెజారిటీ కొడాలికే సపోర్ట్ చేస్తారు. ఆఖరికి కమ్మ వర్గం కూడా 40 శాతం సపోర్ట్ ఉంటుంది. ముస్లిం ఓటర్ల సపోర్ట్ కొడాలికే. అందుకే కొడాలికి విజయాలు వరుసగా వస్తున్నాయి. పైగా టీడీపీకి నిలకడైన నాయకుడు లేకపోవడం కొడాలికి ప్లస్.

కానీ ఈ సారి ఆ పరిస్తితులు మారే ఛాన్స్ ఉంది. కొడాలి ప్రధాన బలమైన ఎస్సీ ఓటర్లని టీడీపీ వైపుకు తిప్పుకునేలా చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము..గుడివాడలో ఎస్సీలకు అండగా ఉంటున్నారు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎస్సీలకు ఆర్ధిక సాయం చేయడం, వారికి అండగా ఉండటం చేస్తున్నారు. పైగా ఆయన భార్య ఎస్సీ వర్గం కావడంతో ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది.

అటు కమ్మ వర్గం ఈ సారి కొడాలిపై ఫుల్ యాంటీగా ఉంది. ఇక పవన్‌ని కొడాలి పదే పదే టార్గెట్ చేయడంతో కాపులు కూడా యాంటీగా కనిపిస్తున్నారు. బీసీల్లో కూడా మెజారిటీ మార్పు కనిపిస్తోంది. అటు రావి వెంకటేశ్వరరావు టీడీపీలో దూకుడుగా పనిచేస్తున్నారు. ఇక టీడీపీ-జనసేన కలిస్తే..ఈ సారి కొడాలికి పెద్ద డ్యామేజ్ చేసేలా ఉన్నాయి.

Leave feedback about this