టీడీపీ అధినేత చంద్రబాబుని ఇష్టమొచ్చినట్లు తిట్టేది కొడాలి నాని అనే సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి ఏ స్థాయిలో బాబుని బూతులు తిడుతూ వచ్చారో అందరికీ తెలిసిందే. అలా తిట్టడం వల్లే కొడాలిని ఎలాగైనా ఓడించాలనే కసితో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఈ సారి గుడివాడలో కొడాలిని ఓడించాలని చూస్తున్నారు.

అయితే గుడివాడలో టీడీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ఆధిపత్య పోరు ఉండటం కొడాలికి అడ్వాంటేజ్ అయింది. ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ రాజకీయం చేస్తున్నారనే ప్రచారం ఉంది. పైగా ఇటీవల ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము గుడివాడ టీడీపీలో ఎంట్రీ ఇచ్చారు..ఇక ఈయన సీటు రేసులోకి వచ్చారు. ఇలా సీటు విషయంలో నేతల మధ్య పోరు నడుస్తోంది. అసలే గుడివాడలో కొడాలి నాని స్ట్రాంగ్..పైగా టీడీపీలో పోరు..దీని వల్ల వచ్చే ఎన్నికల్లో కూడా గుడివాడలో టీడీపీ జెండా ఎగరడం కష్టమనే ప్రచారం వస్తుంది.

ఇలా ప్రచారం నడుస్తున్న సమయంలోనే గుడివాడ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావి, రాము, పిన్నమనేని , బాబ్జీ..ఇలా అందరూ నేతలు కలిసి పాల్గొన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేతలంతా కలిసే పాల్గొన్నారు.

ఇలా నేతలంతా ఐక్యంగా ఉండటంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నేతలు కలిసి ఇంకా కొడాలికి చెక్ పెట్టడం ఖాయమని అంటున్నారు. ఇక సీటు ఎవరికిచ్చిన టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తారని చెబుతున్నారు. చూడాలి మరి వీరి ఐక్యత ఎన్నికల వరకు ఉంటుందో లేదో.

Leave feedback about this